మెగా బ్రదర్స్ పోటీపై క్లారిటీ వచ్చేసింది

0

టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలపై కరోనా ప్రభావం చూపించింది. దాదాపు మూడు నాలుగు నెలలు సినిమా పరిశ్రమల్లో షూటింగ్స్ పూర్తిగా నిలిచి పోయాయి. ఇండియాలో థియేటర్లు మూతబడి చాలా నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా ఓపెన్ కాలేదు. ఎన్నో సినిమాలు విడుదల తేదీు మారాయి. సమ్మర్ నుండి సంక్రాంతి వరకు సినిమాల విడుదల తేదీల్లో పూర్తిగా మార్పులు చేర్పులు వచ్చాయి. ఆగస్టులో చిరు బర్త్ డే కానుకగా ఆచార్యను విడుదల చేయాలనుకున్నారు. దాన్ని ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేస్తామంటూ అధికారికంగా ప్రకటన చేశారు.

నిన్న మొన్నటి వరకు ఆచార్యను సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందన్నారు. అయితే షూటింగ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది కనుక ఆలస్యం అవుతుందని క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కూడా విడుదలకు రెడీ అవుతుంది. కనుక మెగాస్టార్ మూవీ ‘ఆచార్య’ విడుదల వేసవికి వాయిదా వేయడం మంచిదనే నిర్ణయంకు నిర్మాతలు వచ్చినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతికి మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లు మూడు నాలుగు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే ప్రచారానికి తెర పడ్డట్లయ్యింది.

వకీల్ సాబ్ చిత్రం బ్యాన్స్ షూటింగ్ ను నవంబర్ లేదా డిసెంబర్ లో పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయనుండగా ఆచార్య చిత్రాన్ని తాపీగా సమ్మర్ లో విడుదల చేయబోతున్నారు. దాంతో రెండు సినిమాల మద్య ఎలాంటి పోటీ ఉండబోదని క్లారిటీ వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఈ రెండు సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.