‘సైలెన్స్ ‘లో అనుష్క పాత్ర పై క్లారిటీ

0

‘బాహుబలి’ చిత్రం తర్వాత అనుష్క ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కాని బరువు పెరగడంతో అనూహ్యంగా ఈమె గత రెండేళ్లలో కేవలం ‘భాగమతి’ మాత్రమే చేసింది. భాగమతి చిత్రం తర్వాత అస్సలు కనిపించకుండా పోయిన అనుష్క ఎట్టకేలకు కనిపించింది. ‘మిర్చి’లో అనుష్క మాదిరిగా నాజూకుగా తయారు అయ్యింది. అనుష్క చాలా గ్యాప్ తర్వాత ‘సైలెన్స్’ అనే థ్రిల్లర్ మూవీకి కూడా ఓకే చెప్పిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో అనుష్కతో పాటు అంజలి షాలిని పాండే మాధవన్ సుబ్బరాజు శ్రీనివాస్ అవసరాల కూడా నటిస్తున్నారు.

‘సైలెన్స్’ చిత్రంలో అనుష్క ఒక ఎన్నారై లేడీగా కనిపించబోతుందట. ఎన్నారై బిజినెస్ ఉమెన్ గా అనుష్క కనిపించనుండగా అంజలి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతుంది. ప్రముఖ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా కోన వెంకట్ ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి నిర్మించబోతున్నాడు. మార్చి మొదటి లేదా రెండవ వారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ‘సైలెన్స్’ చిత్రంతో పాటు అనుష్క మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటీ అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సైలెన్స్ చిత్రం తర్వాత అనుష్క మళ్లీ బిజీ అవ్వనుందా లేదా అనేది చూడాలి.


Please Read Disclaimer