బిబి4 కంటెస్టెంట్ కరోనా పాజిటివ్ వార్తలపై క్లారిటీ

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ నోయల్ అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే. ఆయన అనారోగ్యంకు కారణం కరోనా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కరోనా సోకవడం వల్లే ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో పాటు కాళ్లు చేతులు బాగా నొప్పులు పుట్టాయి అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ టీం క్లారిటీ ఇచ్చింది. నోయల్ కు కరోనా పాజిటివ్ అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పేర్కొన్నారు. నోయల్ కు ఇతర అనారోగ్య సమస్యలు ఉండటం వల్లే ఆయన్ను బయటకు తీసుకు వచ్చినట్లుగా స్టార్ మా వర్గాల వారు పేర్కొన్నారు.

నోయల్ మళ్లీ పూర్తి ఆరోగ్యంతో రెండు మూడు రోజుల్లోనే హౌస్ లోకి వెళ్తాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. కరోనా అయితే రెండు మూడు వారాల పాటు అందరికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కాని నోయల్ కు కరోనా కాదు కనుక ఆయన ఆరోగ్యం కుదుట పడితే రెండు మూడు రోజుల్లోనే అతడు షో కు వెళ్లే అవకాశం ఉందని స్టార్ మా వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇంటి సభ్యులను కరోనా నుండి దూరంగా ఉంచేందుకు నిర్వాహకులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంటి సభ్యులకు చేరే ప్రతి ఒక్క వస్తువు కూడా ఒకటికి రెండు సార్లు శానిటైజర్ అయిన తర్వాతే వెళ్తుంది. కనుక నోయల్ కు కరోనా వచ్చే అవకాశం లేదు. నోయల్ రీ ఎంట్రీ ఇస్తే అందరి నోళ్లు మూతపడే అవకాశం ఉంది.