“సాహో”లో ప్రభాస్ రోల్ ఇదే.!

0

ఇప్పుడు యావత్తు భారతదేశం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న “సాహో” చిత్రమే అని చెప్పాలి.ఇటీవలే విడుదలైన ఒక్క టీజర్ తో ఈ చిత్రం పై అంచలనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి.అయితే ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రశ్నలు అలా మిగిపోయే ఉన్నాయి.

ప్రభాస్ అసలు ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారని అనేక రకాల సందేహాలు ఉన్నాయి.కొంతమంది ఈ సినిమాలో ప్రభాస్ ఒక స్పై(గూఢచారి) పాత్రలో కనియించబోతున్నారని,మరికొందరు పోలీస్ పాత్రలో కనిపించనున్నారని ఇంకొందరు అయితే సినిమా విడుదల అయ్యేంత వరకు ఏమి చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు.

అయితే ఏ సినిమాలో ప్రభాస్ ఏ రోల్ లో కనిపించనున్నారో ఈ చిత్ర టీజర్ ను కాస్త నిశితంగా గమనిస్తే అర్ధం అయ్యిపోతుందని చెప్పాలి.ఈ సినిమాలో ప్రభాస్ పక్కాగా ఒక పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.ఈ విషయం తాను బైక్ తో చేస్తున్న చేజింగ్ సన్నివేశాలను చూసినట్లయితే అర్ధం అయ్యిపోతుంది.తన బైక్ మీద పోలీస్ అని రాసి ఉండడం వల్ల ఈ విషయం బయల్పడింది.ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఏ రోల్ లో కనిపించనున్నారో ఒక క్లారిటీ వచ్చేసింది.మరి సుజీత్ ఎలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారో తెలియాలంటే వచ్చే ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.
Please Read Disclaimer