పాటతో క్లారిటీ ఇచ్చేసారు

0

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అని టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఇది కేవలం మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అని అందరూ భావించారు. కొందరైతే మహేష్ కి ఎవ్వరు సరిలేరు సాటిలేరు అంటూ మిగతా హీరోలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా వేశారు. అయితే ఒకే ఒక్క పాటతో అలా అనుకున్న వారందరికీ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

సినిమాలో మహేష్ అజయ్ కృష్ణ అనే మేజర్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతని క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ ఓ సాంగ్ తో ఇండియన్ ఆర్మీ కి ఓ ట్రిబ్యూట్ ఇచ్చారు. అదే సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్. ఏదో అప్పటికప్పుడూ రెడీమెట్ గా కొట్టేసినా లిరిక్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. సాంగ్ చివరిలో సరిలేరు నీకెవ్వరు అంటూ అజయ్ కృష్ణ ని ఉద్దేశించి లిరిక్స్ పడ్డాయి. ఈ పాటతో టైటిల్ పెట్టడానికి గల కారణం అందరికీ తెలిసింది.

ప్రస్తుతం దేవి ఈ సినిమాకు బాణీలు అందించే పనిలో ఉన్నాడు. యూనిట్ షూటింగ్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ ఫైట్ షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్ మరో రెండు రోజులు ఉండనుందని సమాచారం. ఆ తర్వాత టీమ్ రామోజీకి షిఫ్ట్ అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రానుంది.
Please Read Disclaimer