సరిలేరు ఆరు షోలకు పర్మిషన్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 11 న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారకార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మొదటి రోజు భారీ సంఖ్య లో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేశారు. ఇదిలా ఉంటే ‘సరిలేరు నీకెవ్వరు’ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో మొదటి వారంలో ఎక్కువ వసూళ్లు సాధించేందుకు వీలుగా ఎక్కువ షోలు ప్రదర్శించడానికి అనుమతి కోసం నిర్మాత అనిల్ సుంకర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో అదనపు షోలకు అనుమతినివ్వాలని కోరుతూ అనిల్ సుంకర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారట. ఈ లేఖను పరిశీలించిన మీదట ‘సరిలేరు నీకెవ్వరు’ టీమ్ కు అదన షోలు ప్రదర్శించుకునే అనుమతినిచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకూ రోజూ ఆరు షోలు ప్రదర్శించుకునే అవకాశం ఉంది. దీంతో ఏపీలోని థియేటర్లు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను రోజుకు ఆరు ఆటలు ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారట.

మహేష్ అభిమానులకు.. ‘సరిలేరు నీకెవ్వరు’ చూడాలనుకునే ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అదనపు షోలకు అనుమతినివ్వడంతో మహేష్ సినిమాకు భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని మహేష్ సినిమా ఎంతవరకూ ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer