‘మాల్దీవ్స్ బీచ్’లో భార్యతో సేదతీరుతున్న కలెక్షన్ కింగ్!!

0

ఈమధ్య సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు మాల్దీవ్స్ అనేది రెగ్యులర్ హాలిడే స్పాట్ గా మారింది. నిజానికి మాల్దీవులు సెలబ్రిటీలకు బాగా ఇష్టమైన ప్రదేశంగా పాపులర్ అయింది. అందుకే ప్రతిసారీ చాలామంది సెలబ్రిటీ జంటలు ఈ అందమైన ద్వీపానికి చేరుకొని బీచ్లో సాయంత్రవేళ సన్ సెట్ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక కపుల్ పిక్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఈ జంట ఎప్పుడు కూడా అలా హాలిడేకు మాల్దీవ్స్ లాంటి ప్రదేశానికి వెళ్లిన దాఖలాలు కనిపించడంలేదు. ఆ సెలబ్రిటీ కపుల్ ఎవరో కాదు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల. మోహన్ బాబు సాధారణంగా ఖాళీ సమయం దొరికితే తిరుపతికి వెళ్లి అక్కడే సేదతీరుతూ.. విలువైన సమయాన్ని గడిపివస్తాడు. కానీ ఈసారి ఆయన సేదతీరడానికి తన భార్యను వెంటేసుకొని ఏకంగా దేశం దాటి వెళ్లాడని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే ట్రిప్ కేవలం మోహన్ బాబు దంపతులకు మాత్రమే కాదు. వారితో పాటు కూతురు లక్ష్మీప్రసన్న అల్లుడు శ్రీనివాసన్ మనవరాలు విద్య నిర్వాణ కూడా ఉన్నారట. ఇదివరకు మంచు లక్ష్మి.. తన తల్లిదండ్రుల ఒడిలో కూర్చుని ఉన్న పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చింది. అందులో కూడా సూర్యాస్తమయం నేపథ్యంలో దిగినట్లు కనిపిస్తుంది. ఫోటోలో ఎలాంటి ఫిల్టర్ లేదని చెప్పుకొచ్చింది. అలాగే ఈ ఫోటోను మోహన్ బాబు అల్లుడు ఆండిశ్రీనివాసన్ తీశాడంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది లక్ష్మిమంచు. అయితే తాజాగా షేర్ చేసిన ఫోటోలో మోహన్ బాబు ఆయన భార్య నిర్మలతో ఇసుక తిన్నెలపై కూర్చొని సూర్యాస్తమయం వేళలో సేదతీరున్నారు. ఇక మోహన్ బాబు చొక్కా షార్ట్ ధరించగా ఆయన భార్య పంజాబీ డ్రెస్ ధరించి భర్త భుజాలపై వాలింది. ఇద్దరూ కెమెరా వైపు చూస్తూ స్మైల్ ఇస్తున్న ఈ మంచువారి సీనియర్ కపుల్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.