స్వాతి సన్నజాజి అయ్యేనే!

0

కలర్స్ స్వాతి ప్రతిభ గురించి తెలిసిందే. బుల్లితెర యాంకర్ గా వెండితెర నాయికగా గొప్ప ఫాలోయింగ్ తెచ్చుకున్న స్వాతి 2018లో మలేషియన్ పైలెట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుని స్థిరపడిన సంగతి తెలిసిందే. వివాహం అయిన దగ్గర నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. మలేషియాలోనే భర్తతో పాటు సెటిలైంది. అయితే సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేసానని మాత్రం ఎక్కడా చెప్పలేదు. తనని అర్ధం చేసుకున్న వాడు దొరికాడని…సినిమాల కు..తన లైఫ్ స్టైల్ కి అడ్డు చెప్పే వాడు కాదని.. స్వాతి ముందు గానే చెప్పింది. వికాస్ చెప్పినట్లే స్వాతికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. పెళ్లి తర్వాతా నటించేందుకు అభ్యంతరం చెప్పలేదట.

ఆ క్రమంలోనే స్వాతి తిరిగి నటనలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలోనే రూపంలో మార్పుకోసం అమ్మడు వర్కౌట్లు మొదలు పెట్టి సన్నబడింది. తాజాగా సన్నటి జాజిలా మారిన కొత్త ఫోటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. స్లిమ్ అండ్ ఫిట్ లుక్ లో చూపరులను ఆకట్టుకుంటోంది. కెరీర్ ఆరంభంలో కలర్స్ ప్రొగ్రామ్ లో ఎంత చక్కగా కనిపించిందో అంతే ఇదిగా మారిపోయింది. స్వీట్ స్మైల్ తో ఆకట్టుకుంటోంది. ఆ పన్ను మీద పన్ను వరుస మారిన శరీరాకృతితో హైలైట్ అవుతోంది.

వాస్తవానికి సినిమాల్లో నటిస్తున్నప్పుడు కంటే మరింత సన్నజాజిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. తెలుగులో అమ్మడు లండన్ బాబులు తర్వాత మరో సినిమా చేయలేదు. దాదాపు రెండేళ్లులగా ఖాళీగానే ఉంటోంది. ఇటీవలే మలయాళంలో ఓ ప్రాజెక్ట్ కు సంతకం చేసింది. గతంలో పలు మలయాళం సినిమాల్లో నటించింది. కానీ నిలదొక్కుకోలేకపోయింది. మళ్లీ మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. మరి ఈసారైనా నిలదొక్కుకుంటుదేమో చూద్దాం.
Please Read Disclaimer