మీరు పెద్ద తోపులా? కౌన్ కిస్కా గొట్టంగాళ్లు: అలీ ఆగ్రహం

0
‘‘రాజుగారి గది 3’ సినిమా బాలేదని అనడానికి మీరు ఎవరు? మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సినిమా బాగుంది బాలేదని చెప్పడానికి మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరూ’’ అంటూ క్రిటిక్స్‌పై మండిపడ్డారు కమెడియన్ అలీ. ఓంకార్ దర్శకత్వం వచ్చిన ఈ మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించగా.. ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించిన అలీ.. నెగిటివ్ ప్రచారం చేస్తున్నవారిపై ఫైర్ అయ్యారు.

ఇక నేను ప్రివ్యూ షోలు చూడను..
ఆయన మాట్లాడుతూ.. ‘ఈ వేదిక మీద ముగ్గురు అన్నదమ్ముల్ని చూశాం. ‘రాజుగారి గది 3’ చూశాం. నెక్స్ట్ 4 కూడా చూస్తాం. నేను తమ్ముడ్ని కాలేను. అన్నను అవుతా. ఈ సినిమాకి పడ్డ కష్టమే ఈ సక్సెస్ మీట్. నేను థియేటర్స్ వెళ్లి సినిమా చూసి చాలా రోజులైంది. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాలనుకున్నా. నేను నటించానని కాదు కాని కుకట్ పపల్లి బ్రమరాంభ థియేటర్‌కి వెళ్లి సినిమా చూశాం. సినిమా చూస్తే అక్కడే చూడాలనిపించింది. వాళ్లు కల్మషం లేకుండా డబ్బులు పెట్టి చూస్తారు.
Please Read Disclaimer