కమెడియన్ అలీ ఇంట విషాదం

0

కమెడియన్.. బుల్లితెర హోస్ట్ అలీ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమండ్రిలోని స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. అయితే తన మాతృమూర్తి మరణ వార్త వినే సమయంలో అలీ రాంచీలో ఓ షూటింగ్ లో బిజీగగా ఉన్నారని తెలుస్తోంది. వార్త తెలియగానే.. ఆయన స్వస్థలానికి బయలుదేరారు. జైతున్ బీబీ భౌతికకాయాన్ని కూడా హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

నేటి (గురువారం) సాయంత్రం హైదరాబాద్ లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలీకి అమ్మతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పది అని సన్నిహితులు చెబుతుంటారు. అలీ నటించిన యమలీల చిత్రంలోనూ మదర్ సెంటిమెంట్.. ఎమోషనల్ సీన్స్ లో అతడు జీవించిన వైనం అభిమానులు మర్చిపోలేరు. ఆ ఎమోషన్ రియల్ లైఫ్ ఎమోషన్ అని చెబుతారు.

ఇక అలీ తన తల్లిదండ్రులపై ఎంతో ప్రేమానురాగాలు చూపించేవారు. జీవితంలో తన ప్రతి అడుగులో తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనని నడిపించిందని అలీ ఎంతో ఎమోషనల్ గా చెబుతుంటారు. షూటింగ్ అయ్యాక తన కాలక్షేపం పూర్తిగా ఇంట్లోనే. అది కూడా తన పేరెంట్స్ తో గడిపేందుకే అలీ అండ్ బ్రదర్స్ ఇష్టపడతారు. ఇక అలీకి హైదరాబాద్ ఇందిరానగర్ లో సొంతంగా ఓ ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. ఆ ఇంటితో ఎంతో అనుబంధం ఉండేదని చెబుతారు. అలీ సోదరుడు ఖయ్యుమ్ కూడా సినీరంగంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-