దూసుకొస్తున్న హాస్యతరంగం ‘పమ్మి’

0

అసలే టాలీవుడ్ లో కమెడియన్ల కొరత విపరీతంగా ఉంది. ఒకప్పుడు ఆలీ మొదలుకుని కోట శ్రీనివాసరావు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం అద్భుతమైన హాస్యంతో ప్రేక్షకులను రంజింపజేశారు. ఇప్పుడు మాత్రం ఆ స్థాయిలో చేసేవాళ్లు తగ్గిపోయి కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఐదారుగురు ఉన్నప్పటికీ టైమింగ్ విషయంలో ఒకరకమైన మొనాటనీ చూపించడంతో ఆడియన్స్ కొత్తగా ఫీలవ్వలేకపోతున్నారు.

ఇలాంటి టైంలో ఒక పాత్రకు మరొక పాత్రకు సంబంధం లేకుండా అన్ని వేరియేషన్స్ ని చక్కగా చూపిస్తున్న పమ్మి సాయి ఇప్పుడు దూసుకుపోతున్నాడు. పాత్ర పరిధి చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా తన ఉనికిని చాటుకోవడంలో సక్సెస్ అవుతున్న పమ్మి సాయి మంచి డిమాండ్ లో ఉన్నాడు. నిన్న విడుదలైన రణరంగంలో విలన్ మురళి శర్మ అనుచరుడిగా ఎవరులో పోలీస్ గా నటించిన అడవి శేష్ కు అసిస్టెంట్ కానిస్టేబుల్ గా బాగా మెప్పించి రిజిస్టర్ అయ్యాడు.

హాస్యాన్ని చిన్నచిన్న మాటలతో బాగా పండించే పమ్మి సాయి అతడుతో మొదలుకుని జులాయి – అత్తారింటికి దారేది – రంగస్థలం – ఇస్మార్ట్ శంకర్ – బ్రోచేవారెవరురా లాంటి ఎన్నో హిట్స్ లో తనదైన పాత్ర పోషించాడు. రోల్ ఏదైనా అందులో ఇమిడిపోయి దర్శకుడి అంచనాకు తగ్గట్టు చేయడం పమ్మి సాయి ప్రత్యేకత.

అందువల్లే చిన్నదో పెద్దదో ఏదో ఒక పాత్రను పమ్మి సాయికి ఆఫర్ చేస్తున్నారు దర్శకులు.ఇంకా పెద్ద ఛాలెజింగ్ పాత్రల కోసం ఎదురు చూస్తున్న పమ్మి సాయి అలాంటిది దక్కలే కానీ తానేంటో రుజువు చేసుకునేలా ఉన్నాడు. తగినంత గుర్తింపు ఉన్నా అలాంటి రోల్స్ కోసం తాపత్రయపడుతున్న పమ్మి సాయికి మంచి ఫ్యూచర్ కనిపిస్తోంది మరి
Please Read Disclaimer