బాత్రూమ్ ఏజెంట్

0

కమెడియన్ గా చిన్నా చితకా పాత్రల్లో కనిపించే నవీన్ పోలిశెట్టి ఈ సారి ఏకంగా హీరో అవుతున్నాడు. అతడు నటిస్తున్న తాజా చిత్రం `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`. ఇందులో నవీన్ డిటెక్టివ్‌గా కనిపించబోతున్నాడు. సుమంత్ కు `మళ్లీరావా` సినిమాతో సక్సెస్‌ని అందించిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీపావళి సందర్భంగా మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో టాయిలెట్ టబ్ పై కూర్చుని టాబ్లాయిడ్ ని ఆసక్తిగా చూస్తున్న తీరు. ఆ పేపర్ పై `ఎఫ్‌బీఐ నెల్లూర్` అని ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తలపై హ్యాట్ పెట్టుకుని బ్లూకలర్ సూట్లో నవీన్ పొలిశెట్టి లుక్ కూడా సినిమా పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. సినిమా ప్రారంభానికి ముందు టైటిల్ పోస్టర్ని విడుదల చేసి ప్రేక్షకుల్లో క్యురియాసిటీని పెంచిన మేకర్స్ ఫస్ట్‌లుక్ విషయంలోనూ అదే పంథాను అనుసరించడం విశేషం.

`మళ్లీరావా` చిత్రంతో గౌతమ్ తిన్ననూరిని దర్శకుడిగా పరిచయం చేసిన రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమా ద్వారా మరో కొత్త యువకుడిని దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో స్వరూప్ ఆర్ఎస్జె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శృతిశర్మ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ని కూడా ఇదే తరహాలో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట.