హీరో అవుతున్న మరో కమెడియన్?

0

`స్వామిరారా` చిత్రం తో కమెడియన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు సత్య. డిఫరెంట్ మ్యానరిజమ్… డైలాగ్ డెలివరీతో పరిశ్రమలో తనకంటూ ఓ ఐడెంటిటీ సంపాదించాడు. తక్కువ సమయంలోనే పాపులరైన కమెడియన్ గానూ పేరు తెచ్చుకున్నాడు. స్వామిరారా విజయంతో సత్య టాలీవుడ్ లో బిజీ అయ్యాడు. స్టార్ హీరోల సినిమాల్లోనూ భాగమయ్యాడు. నేటితరం దర్శకులు తనకోసమే ఓ పాత్రను క్రియేట్ చేయగలిగే స్థాయి కి చేరుకున్నాడు. గడిచిన మూడు నాలుగేళ్ల లో సత్య క్షణం తీరిక లేని షెడ్యూళ్ల తో బిజీ బిజీ. నిత్యం సినిమాల తో అతడి కాలక్షేపం సాగుతోంది.

ఇటీవలే `అర్జున్ సురవరం` సక్సెసవ్వడం లో సత్య భాగస్వామ్యం ఉందనే చెప్పాలి. అందులో తన పాత్రకు పేరొచ్చింది. నిఖిల్-సత్య కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరో సారి కలిసొచ్చిందన్న టాక్ వినిపించింది. స్వామిరారా తర్వాత మళ్లీ సెంటిమెంట్ పునరావృతం అయ్యింది. తాజాగా కీరవాణి తనయుడు శ్రీసింహా నటించిన `మత్తు వదలరా` చిత్రంలోనూ సత్య కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇందులో సత్య కామెడీ కి కడుపుబ్బా నవ్వని ప్రేక్షకుడు లేడు. సత్య కామెడీ టైమింగ్ కి జనం బాగా కనెక్టయ్యారు. సత్య కలర్… కర్లీ హెయిర్ స్టైల్.. ఆహార్యం ప్రతిదీ పెద్ద ప్లస్ అని ప్రశంలందుకున్నాడు.

సినిమా అంతా కామెడీ తో రక్తి కట్టించిందన్న టాక్ కేవలం సత్య వల్లనే సాధ్యమైంది. ప్రస్తుతం సత్య డిస్కో రాజా చిత్రం లో నటిస్తున్నాడు. ఇంకొన్ని సినిమాలు చేతి లో ఉన్నాయి. మరి సత్య కమెడియన్ గా క్లిక్ అయ్యాడు కాబట్టి…ఇకపై తనలో హీరోయిజాన్ని కూడా బయటకు తీస్తాడేమో చూడాలి. హాస్య నటులుగా పరిచయమై హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఫెయిలైన వారి సెంటిమెంట్ ని సత్య బ్రేక్ చేస్తాడేమో చూడాలి.
Please Read Disclaimer