జబర్దస్త్ ట్విస్ట్.. నాగబాబు క్విట్‌కి బోయపాటి కారణం: అసలు సీక్రెట్ చెప్పిన షేకింగ్ శేషు

0

జబర్తస్ నుండి ఎవరు వెళ్లినా ఉన్నా.. షో మాత్రం ఆగే ప్రసక్తే లేదన్నారు కమెడియన్ షేకింగ్ శేషు. జబర్దస్త్ పేరుకి తగ్గట్టే ఎప్పటికీ జబర్దస్త్‌గానే ఉంటుందన్నారాయన. జబర్దస్త్ షో ఆగిపోతుందంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అంటూ కొట్టిపారేశారు షేకింగ్ శేషు.

జబర్దస్త్‌ని డ్యామినేట్ చేయలేరు..

ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్దస్త్ అనేది జబర్దస్త్‌గానే ఉంటుంది. దాన్ని డ్యామినేట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రజల్లోకి జబర్దస్త్ బలంగా వెళిపోయింది. జబర్దస్త్ నుండి చాలా మంది బయటకు వెళ్లారు.. మళ్లీ వచ్చారు షో ఎప్పుడైనా ఆగిందా? ఒకరు పోతే మరొకరు వస్తారు. చంటి, నాగరాజు, ధనరాజ్, వేణు ఇలా చాలా మంది బయటకు వెళ్లారు ఆగిందా? మధ్యలో నాగబాబు కూడా గ్యాప్ ఇచ్చారు షో ఆగలేదు కదా? అంతెందుకు నేను కూడా జబర్దస్త్ నుండి బయటకు వచ్చా.. షో ఆగలేదు కదా.. జబర్దస్త్ స్థాయే వేరు.

హైపర్ ఆది వాళ్లందర్నీ డ్యామినేట్ చేశారు…

ఒకరు జబర్దస్త్ నుండి పోతే మరొకరు రావడం సహజంగా జరిగేదే. అలా వెళ్లడం రాకపోవడం ఉండకపోతే ఆది వచ్చేవాడా? మధ్యలో వచ్చిన హైపర్ ఆది అందర్నీ డ్యామినేట్ చేశాడు కదా.. సుధీర్ వెళ్లినా ఎవరు వెళ్లినా షో ఆగిన సందర్భం లేదు. ప్రేక్షకులకు కావాల్సింది హాస్యం.. అది ఎవరు పంచినా చూస్తారు. ఈ మధ్య ఓ బుడ్డోడి జబర్దస్త్‌ స్కిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. కామెడీ అనేది ఎవరు చేసినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.

నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లడానికి కారణం బోయపాటి..

ఏడేళ్ల పాటు నాగబాబు జబర్దస్త్ షోకి జడ్జ్‌గా ఉన్నారు.. మధ్యలో చాలా సార్లు ఆయను కుదర్లేదు. అయితే ఆయనకు ఇప్పుడు సినిమాల్లో మంచి ఆఫర్ వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఆయనకు మంచి క్యారెక్టర్ వచ్చింది. అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కావడంతో దానికి దీనికి కుదరదని బయటకు వచ్చేశారు. ఇందులో వివాదం ఏం లేదు.

ఎన్టీఆర్ శ్రీక్రిష్ణుడి వేషం వేస్తేనే జనం చూశారు.. ఇదీ అంతే

కామెడీ షోలు ఎన్ని వచ్చినా జబర్దస్త్‌ని అందుకోలేదు. ఉదాహరణకు ఎన్టీఆర్ శ్రీక్రిష్ణుడు వేషం వేస్తేనే జనానికి నచ్చేది. ఆయనకంటే అందగాళ్లు ఎంతమంది శ్రీక్రిష్ణుడు వేషం వేసినా సెట్ అయ్యేది కాదు. శ్రీక్రిష్ణుడు వేషం వేస్తే ఎన్టీఆర్ మాత్రమే వేయాలనేవారు. సోభన్ బాబు మంచి అందగాడు.. అయినా ఆయన శ్రీక్రిష్ణుడు వేషం వేస్తే జనానికి నచ్చాలి కదా. ప్రేక్షకులు చూడాలి. తెలుగు ప్రేక్షకులు జబర్దస్త్‌కి రాజముద్ర వేశారు. జబర్దస్త్‌కి పోటీగా ఎన్ని కామెడీ షోలు వచ్చి వేరేది చూడరు.

జబర్దస్త్‌లో ఎవర్నీ తీయరు.. పోతాం అంటే ఆపరు

గతంలో ఎలక్షన్స్ అప్పుడు నాగబాబు షోకి రాకపోతే తీసేశారని అన్నారు. జబర్దస్త్ వాళ్లకు నాగబాబుకి గొడవ అయ్యిందని ఆయన్ని పీకేశారని పుకార్లు వచ్చాయి. అసలు నిజం ఏంటన్నది బయటకు తెలియదు. జబర్దస్త్‌ నుండి ఎవరికైనా బయటకు వెళ్లే అవసరం వస్తే వెళ్తారు.. వీళ్లు వెళ్తాం అంటే వాళ్లు ఆపరు. వీళ్లు పోతే వాళ్ల ప్లేస్ రీప్లేస్ చేస్తారు. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. ధనరాజ్, వేణు లాంటి వాళ్లు బయటకు వచ్చేశారు.. వాళ్ల వాల్యూ తెలుస్తుందేమో అని వాళ్లు వచ్చిన తరువాత ఎలాంటి మార్పు లేదు. షో ఎప్పటిలాగే కంటిన్యూ అయ్యింది. జబర్దస్త్ స్టేజ్ దొరకడం గ్రేట్. అలాంటి అవకాశం దొరికితే ఎవరూ వదులుకోరు. నేను సుప్రీం సినిమా టైంలో పర్మిషన్ అడిగి బయటకు వచ్చా.. తరువాత మళ్లీ వెళ్లా అంటూ చెప్పుకొచ్చారు షేకింగ్ శేషు.
Please Read Disclaimer