తెలుగమ్మాయిలు ‘కమిట్ మెంట్’ కి రెడీ!

0

2018-19 సీజన్ అంతా మీటూ వ్వవహారం పీక్స్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో నటీమణులంతా వేడెక్కించారు. పలువురు బిగ్ షాట్స్ పై తీవ్ర ఆరోపణలు చేసి కోర్టులకెక్కారు. అయితే అప్పట్లో కమిట్ మెంట్ల భోగోతంపై సినిమా తీసేందుకు ఎవరూ సాహసించిందేం లేదు. అయితే లక్ష్మీ కాంత్ చెన్న.. దీనిని బ్రేక్ చేస్తూ ఏకంగా కమిట్ మెంట్ పేరుతో సినిమా తీస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి వేడెక్కించే పోస్టర్లు ఇప్పటికే అంతర్జాలంలోకి రిలీజై వైరల్ అయ్యాయి. తాజాగా `కమిట్ మెంట్` నుంచి ప్రీ లుక్ విడుదలైంది. ఫస్ట్లుక్ కి సంబంధించిన సమాచారం రివీలైంది. తాజా బోల్డ్ లుక్ లో నలుగురు అమ్మాయిల కాళ్ళు చూపిస్తూ మత్తెక్కించారు. ఇక ఫస్ట్ లుక్ మార్చి 7న విడుదుల కానుంది. లుక్ ని బట్టి తాజా మూవీ ఎంత బోల్డ్ గా ఉండబోతోందో అర్థమవుతోంది. సినిమా ఛాన్సుల కోసం వచ్చిన అమ్మాయిల్ని ఇండస్ట్రీ జనం ఎలా కమిట్ మెంట్ అడుగుతారో తెరపై చూపించబోతున్నారని అర్థమవుతోంది. ఇక కమిట్ మెంట్ కి అసలు కారణమేంటో ఈ చిత్రంలో చూపిస్తారా? అన్నది చూడాలి. `కమిట్మెంట్` మూవీ నలుగురు అమ్మాయిల విభిన్న కథల ఆధారంగా రూపొందుతోంది.

ఇక ఈ చిత్రంలో తెలుగమ్మాయి.. బిగ్ బాస్ ఫేం తేజస్వి మాదివాడ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. తేజస్వి బోల్డ్ యాక్టింగ్ తో మతి చెడగొడుతుందని చెబుతున్నారు. ఆర్జీవీ ఐస్ క్రీమ్ తో పోలిస్తే ఇందులో పదింతలు గ్లామర్ షోకి ఎలివేషన్ కి ఆస్కారం ఉందని తెలుస్తోంది. ఈ ఏప్రిల్ లోనే సినిమా రిలీజవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-