‘కమిట్ మెంటల్’ ట్రైలర్..!

0

‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి భూపాళం – ఉద్భవ్ రఘునందన్ ప్రధాన పాత్రలలో రూపొందించిన వెబ్ సిరీస్ ”కమిట్ మెంటల్”. ఇటీవల ఇంస్టాగ్రామ్ ద్వారా ఈ సిరీస్ ని అనౌన్స్ చేయడానికి పునర్నవి చేసిన హడావిడి సంగతి తెలిసిందే. తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం రూపొందించబడిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు. నవంబర్ 13 నుంచి ‘ఆహా’ లో ‘కమిట్ మెంటల్’ స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

‘కమిట్ మెంటల్’ టీజర్ లో అనూ(పునర్నవి) – ఫణి (ఉద్భవ్) పాత్రల స్వభావాలను పరిచయం చేసిన మేకర్స్.. ట్రైలర్ లో లవ్ ట్రాక్ ను చూపించారు. ఇది మూడేళ్ళ పాటు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ షిప్ మైంటైన్ చేసి ఫైనల్ గా ఒకటవుదామని నిర్ణయించుకున్న అమ్మాయి అబ్బాయి స్టోరీ అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ఒకరు అమెరికాలో మరొకరు ఇండియాలో ఉండటం వల్ల ఒకరినొకరు వ్యక్తిగతంగా పెద్దగా తెలుసుకోలేకపోయారని తెలుస్తోంది. ఆమె కోసం అమెరికా నుండి అతను ఇండియాకి వచ్చిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకునే క్రమంలో వారి మధ్య జరిగిన విషయాలను ఎలా పరిష్కరించుకున్నారనేది ఇందులో చూపించారు. ట్రైలర్ చివర్లో ‘నేను లైట్ వేసుకుని పడుకుంటానా.. నాకు ఏ ఫుడ్ అంటే ఎలర్జీ.. నాకు కుక్క అంటే భయమా.. పిల్లి అంటే భయమా.. అంటూ పునర్నవి పాస్ట్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో విజువల్స్ చూస్తుంటే ఈ వెబ్ సిరీస్ రిచ్ గా తీసారని తెలుస్తోంది. మొత్తం మీద ఫస్ట్ లుక్ – టీజర్ ద్వారా ఆకట్టుకున్న ‘కమిట్ మెంటల్’.. ఇప్పుడు ట్రైలర్ తో మరింత ఆసక్తిని రేపింది.

కాగా ఈ సిరీస్ ‘పర్మినెంట్ రూమ్ మేట్స్’ వెబ్ సిరీస్ కి తెలుగు రీమేక్ గా రానుంది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ భాగస్వామ్యంలో టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్) ప్రొడక్షన్స్ ఈ సిరీ్స ని నిర్మించారు. ఆహా ఓటీటీలో దీపావళి కానుకగా ‘కమిట్ మెంటల్’ నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.