బాస్ బర్త్ డే కామన్ డీపీ అమేజింగ్

0

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాల అజేయమైన జైత్ర యాత్ర గురించి తెలిసిందే. కెరీర్ 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` గాంధీ జయంతి కానుకగా 2019 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజవుతోంది. ఖైదీనంబర్ 150 (2017 రిలీజ్)తో `బాస్ ఈజ్ బ్యాక్` అంటూ సంబరాలు చేసుకున్న మెగాభిమానులు ఆ తర్వాత బాస్ సినిమా రాకకోసం రెండేళ్లుగా ఎంతో ఓపిగ్గా వేచి చూశారు. ఎట్టకేలకు `సైరా` రిలీజ్ కి కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా మెగాస్టార్ కి తనయుడు రామ్ చరణ్ ఇస్తున్న కానుక. తన మాతృమూర్తి సురేఖ కొణిదెల ఆకాంక్ష ఈ భారీ చిత్రం. అందుకే అన్ లిమిటెడ్ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నామని చరణ్ తెలిపారు.

అయితే ఇంత ప్రతిష్ఠాత్మకమైన సినిమా రిలీజ్ కి వస్తుంటే అంతకుముందు జరుపుకోబోయే మెగా బర్త్ డే ఎలా ఉండాలి? ప్రపంచం నలు దిశలా చెప్పుకునేంత గ్రాండ్ గానే ఉండాలి. అందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానులు ప్రిపరేషన్స్ లో ఉన్నారు. ఆగస్టు 22న అన్నయ్య బర్త్ డే గ్రాండ్ గా జరిపేందుకు ఏర్పాట్లలో ఉన్నారు. ఈసారి `సైరా` నరసింహుని బర్త్ డే గా భావించి అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఒక కామన్ డీపీని రూపొందించారు. మెగాస్టార్ డీపీ సామాజిక మాధ్యమాల్లోకి వచ్చేసింది. వాట్సాప్ లలో వైరల్ గా మారింది. `హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ చిరంజీవి` అంటూ మూడు రోజుల ముందుగానే డీపీని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. దీంతో అసలు ట్రీట్ మొదలైంది.

ఈ డీపీలో మెగాస్టార్ పోషించిన బ్లాక్ బస్టర్ క్యారెక్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఖైదీ నుంచి ఖైదీ నంబర్ 150- సైరా వరకూ స్పెషల్ క్యారెక్టర్స్ ని కామన్ డీపీలో ఎలివేట్ చేశారు. ఇంద్ర-ఠాగూర్-గ్యాంగ్ లీడర్-ఘరానా మొగుడు- శంకర్ దాదా ఎంబీబీఎస్- ముఠా మేస్త్రి- ఖైదీ- రౌడీ అల్లుడు- పునాది రాళ్లు- ప్రాణం ఖరీదు .. ఒకటేమిటి ఎన్నో స్పెషల్ మూవీస్ నుంచి చిరు పోస్టర్లను సేకరించి ప్రత్యేకంగా డీపీని రూపొందించారు. ఈ డీపీ అభిమానులకు కన్నుల పండుగగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. అన్నట్టు యథావిధిగానే మెగాస్టార్ బర్త్ డే రోజున అభిమానులు సామాజిక సేవాకార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఈసారి వరద బాధితుల కోసం `హెల్ప్ ఫ్లడ్ విక్టిమ్స్` పేరుతో ప్రత్యేకించి కార్యక్రమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ మేరకు డీపీపై ప్రత్యేకంగా లోగోని ముద్రించడం ఆసక్తికరం. కేరళ వరదలతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో గోదారి – కృష్ణా పరీవాహక ప్రాంతాలు నీట మునిగాయి. మరి అందరికీ మెగాభిమానులు నిధి సేకరిస్తున్నారేమో చూడాలి.
Please Read Disclaimer