సాహోపై పోలికల వర్షం!!

0

విడుదలకు ఇంకో 35 రోజులే సమయం ఉన్న నేపథ్యంలో సాహో టీమ్ హైప్ ని పెంచే పనిలో భాగంగా కొత్త పోస్టర్లను క్యూ కట్టి మరీ వదులుతోంది. ఇవాళ రిలీజ్ చేసిన యాక్షన్ పోస్టర్లో ప్రభాస్ శ్రద్ధ కపూర్ లు ఒకవైపు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తుండగా మరోవైపు నుంచి శత్రువుల కమాండోలు గన్నులతో తూటాల వరద పారిస్తున్నారు. ఇదేదో కీలకమైన యాక్షన్ బ్లాక్ అనే క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడీ పోస్టర్ కు సంబంధించి పోలిక పర్వంతో పాటు ఓ వినూత్న విశ్లేషణ సోషల్ మీడియాలో సాగుతోంది.

బాహుబలి 2 ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ అనుష్కలతో కోటలో జరిగే బాణాల యుద్ధం గుర్తుందిగా. అనుష్క తన శత్రువులతో ఎలా పోరాడాలో అర్థం కాని అయోమయంలో ఉన్నప్పుడు ప్రభాస్ ఒకేసారి నాలుగైదు బాణాలు ఎలా వాడాలో చేతి వేళ్ళ సహాయంతో నేర్పిస్తాడు. అచ్చం అదే తరహాలో సాహోలో గన్ను పట్టుకుని ప్రభాస్ శ్రద్ధకు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది కదూ

ఇదిలా ఉంచితే పోస్టర్ తో మరో పోలిక కూడా వైరల్ అవుతోంది. రైన్ బో సిక్స్ సీజ్ అనే గేమ్ కు సంబంధించిన పోస్టర్ థీమ్ కూడా అచ్చం ఇలాగే ఉండటం ఇప్పుడు వైరల్ అవుతోంది. స్ఫూర్తి పొందారా లేక అనుకోకుండా జరిగిందా చెప్పలేం కానీ మధ్యలో అద్దంతో సహా థీమ్ ఒకేలా అనిపించడం మాత్రం విచిత్రమే. అప్పుడే దీని మీద మీమ్స్ కూడా మొదలైపోయాయి.

టాలీవుడ్ లో బాహుబలి తర్వాత అంత గర్వంగా చెప్పుకునే స్థాయిలో నిలుస్తుందని ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సాహో ఆగస్ట్ 30 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇంకొద్ది రోజుల్లో రెండో ఆడియో సింగల్ రిలీజ్ చేయబోతున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెలుగులో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాహో మీద అంచనాలు మాములుగా లేవు
Please Read Disclaimer