నటి నోటి దురుసుపై బాలల కమీషన్ కి ఫిర్యాదు

0

తనదైన నట ప్రతిభతోనే కాదు.. పలు వివాదాలతోనూ స్వరా భాస్కర్ పేరు ఇటీవల పాపులరైంది. ఈ ట్యాలెంటెడ్ బాలీవుడ్ నటికి హిందీలోనే కాదు.. ఇటు తెలుగు నాటా ఫ్యాన్స్ ఉన్నారు. తను వెడ్స్ మను- రాంజానా- వీరే ది వెడ్డింగ్ లాంటి సినిమాల్లో స్వరా నటనకు మనవాళ్లు కూడా ఫిదా అయిపోయారంతా. ఇక ఈ భామ మీటూ వేదికగా పలువురిపై ఆరోపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో పురుషాధిక్యత.. వేధింపుల కల్చర్ పై తీవ్రంగానే దుమ్మెత్తిపోసింది. ఇక మగువల్లో ఐడియలిజం గురించి మాట్లాడే ఈ అమ్మడు ఓ చిన్నారిని నోటికొచ్చినట్టు తిట్టేస్తూ అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియో సాక్ష్యం కాస్తా సామాజిక మాధ్యమాల్లోకి లీకవ్వడంతో నెటిజనం చెడుగుడు ఆడేస్తున్నారు.

`షో ఆఫ్ అబీష్` చాట్ షోలో నాలుగేళ్ల చిన్నారి బాలకుడితో కలిసి స్వరా భాస్కర్ పాల్గొంది. ఆ కార్యక్రమం చిత్రీకరణ సమయంలో ఆ బాలకుడు తనని `ఆంటీ` అని పిలిచాడట. అయితే ఆ సమయంలో స్వరా ఆ బాలుడిని ఏమీ అనలేదు. అప్పటికి తమాయించుకుని ఆ తర్వాత నిజస్వరూపం బయటపెట్టింది. ఆంటీ అని తనని పిలిచినందుకు ఆ మాటల్ని గుర్తు చేసుకుని మరీ తిట్టింది. `కమీనా.. చుటియా.. అంటూ తిట్టకూడని తిట్లే తిట్టేసింది. పిల్లలు బేసిక్ గా ఈవిల్ కదా! అని కూడా అనేసింది.

ఈ మాటలు విన్న సోషల్ మీడియా జనం స్వరాని ఫుల్ గా రివర్సులో ఆడుకుంటున్నారు. #స్వరా ఆంటీ అంటూ అందరూ తిట్టిపోస్తున్నారు. జాతీయ బాలల భద్రతా హక్కుల కమీషన్ కి ఫిర్యాదు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఆ మేరకు పలు ఎన్జీవోలు గొంతు విప్పాయి. ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఆంటీ.. ప్చ్!!
Please Read Disclaimer