రాంబాబు దర్శకుడిపై కామ్రేడ్ ఒత్తిడి

0

డియర్ కామ్రేడ్ ట్రైలర్ వచ్చాక ఏదో అద్భుతాన్ని చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగేలా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేసిన విజయ్ దేవరకొండ టీమ్ ఇప్పుడు ఒకరకంగా షాక్ లో ఉంది. ఊహించని రీతిలో డివైడ్ టాక్ రావడం ఎంత పబ్లిసిటీ చేసినా పాజిటివ్ గా మారే సూచనలు కనిపించకపోవడం వెరసి విజయ్ కు ఇదొక స్వీట్ వార్నింగ్ లాగా పనిచేస్తోంది. అర్జున్ రెడ్డి – గీత గోవిందం ఇచ్చిన సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేయడం అంత ఈజీ కాదు.

వాటి తర్వాత చేసిన నోటా డిజాస్టర్ కాగా టాక్సీ వాలా విజయ్ స్టామినాను బట్టి కాక జరిగిన బిజినెస్ ని బేస్ చేసుకుని కమర్షియల్ సక్సెస్ అనిపించుకుంది. సో విజయ్ దేవరకొండ కు సాలిడ్ గా మరో రెండు మూడు బ్లాక్ బస్టర్లు పడితేనే జయాపజయాలకు అతీతంగా ఒక పవర్ ఫుల్ బ్రాండ్ అనేది ఏర్పడతుంది. అంతే తప్ప నాలుగు భాషల్లో సినిమాను రిలీజ్ చేసినంత మాత్రాన కాదు

సరే ఇవన్నీ ఎలాంటి హీరోకైనా ఎదురయ్యే అనుభవాలే కాబట్టి ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నెక్స్ట్ రెడీ అవుతున్న మూవీ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కెఎస్ రామారావు నిర్మిస్తున్నది. ఇప్పటికే కీలక భాగం పూర్తయ్యింది. క్రాంతి మాధవ్ గత సినిమా సునీల్ తో చేసిన ఉంగరాల రాంబాబు. అంతకు ముందు చేసిన మంచి సినిమాల కంటే ఇదే బాగా నెగటివ్ ప్రచారానికి పనికొచ్చింది. సో ఈయనకూ ఇది సవాల్ లాంటిదే.

కాకపోతే డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్ ఈయన మీద బాధ్యత పెంచింది. విజయ్ దేవరకొండ సైతం తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుని కొత్త తరహాలో ఛాలెంజింగ్ పాత్రలు చేయాలి. అప్పుడే మార్కెట్ స్ట్రాంగ్ గా మారి స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. దానికి టైం అయితే పడుతుంది. బై లింగ్వల్ మూవీ హీరోకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ముందువచ్చేది క్రాంతి మాధవ్ సినిమానే. అంచనాలు అందుకోవాల్సిన ప్రెజర్ అయితే ఫేస్ చేయాల్సిందే
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-