కండిషన్స్ అప్లయ్ అంటున్న విజయ్ శాంతి

0

ఒకప్పటి హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.. అనిల్ రావిపూడి నరేషన్ కి ఇంప్రెస్ అవ్వడం పైగా కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావడంతో ఈ సినిమా ఒకే చేసినట్టు చెప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల విషయం లో రెండు కండీషన్స్ పెట్టి మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట.

అవును సినిమాలో విజయ్ శాంతి నటించాలంటే ఆమె భారీ రెమ్యునరేషన్ ని భరించక తప్పదట. సరిలేరు కి కూడా అధిక మొత్తంలో తీసుకుందని సమాచారం. ఇక రెండో కండీషన్ మదర్ పాత్రలు కానీ గెస్ట్ రోల్స్ లాంటి క్యారెక్టర్స్ కానీ చేయదట లేడీ సూపర్ స్టార్. కథలో కీ రోల్ ఉండాల్సిందే అంటోంది. సరిలేరు నీకెవ్వరులో కూడా ఆమె ది చాలా కీ రోల్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఆమె పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది.

అందుకే సరిలేరు నీకెవ్వరు కి అప్లయ్ చేసిన కండీషన్స్ నే మళ్ళీ నెక్స్ట్ సినిమాలకు కూడా కట్టుబడి ఉండాలని నిర్ణయించుకుంది సీనియర్ హీరోయిన్. మరి సినిమాకు విజయశాంతి సంప్రదించాలంటే ముందుగా ఈ కండీషన్స్ ను ఒకే అనుకున్నాకే దర్శక-నిర్మాతలు ఆమె దగ్గరికి వెళ్ళాలి.
Please Read Disclaimer