‘వెంకీ మామ’ వచ్చేదెప్పుడు ?

0

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ సినిమాలపై ప్రేక్షకుల్లో ప్రత్యేక దృష్టి ఉంటుంది. ప్రస్తుతం వెంకటేష్ నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’ సినిమా అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించకుండా ఊరిస్తుంది. వెంకటేష్ -చైతూ మామ అల్లుళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అటు అక్కినేని ఫ్యాన్స్ ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ విషయంలో అటు ఇటు ఊగుతుంది. నిర్మాత సురేష్ బాబు ఇప్పటికే ఓ రెండు డేట్స్ అనుకొని డిస్కర్షన్ జరుపుతున్నారు. ఇప్పటికే డిసెంబర్ ఎండింగ్ లో బాలయ్య ‘రూలర్’సాయి తేజ్ ‘ప్రతి రోజు పండగే’ వస్తున్నాయి. ఆ తర్వాత దిల్ రాజు తన ‘ఇద్దరి లోకం ఒకటే’ ను థియేటర్స్ లోకి దింపుతున్నారు. అంటే వెంకీ మామ కి డిసెంబర్ రెండో వారం ఒక్కటే ఆప్షన్ గా కనిపిస్తుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వెంకీ మామ డిసెంబర్ 13 న థియేటర్స్ లోకి వచ్చే చాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ చెప్పకుండా ఫ్యాన్స్ ను వెయిట్ చేయిస్తున్న సురేష్ బాబు ఎప్పుడురిలీజ్ న్యూస్ చెప్తాడో చూడాలి.
Please Read Disclaimer