పవన్ ను అభినందించిన వివాదాస్పద గాయిని

0

సౌత్ ఇండియాలో మీటూ ఉద్యమంకు ఊతం ఇచ్చేలా కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రముఖులపై విమర్శలు చేసిన సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయడం లేదా ఎవరినో ఒకరిని విమర్శించడం చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఆడవారికి సంబంధించి అన్యాయం జరిగినా కూడా తనవంతుగా సోషల్ మీడియా ద్వారా స్పందించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఒక సినిమా గురించి మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ లో సక్సెస్ అయిన పింక్ సినిమాను తమిళంలో అజిత్ హీరోగా నేర్కొండ పార్వాయి అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. ఆడవారిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఇన్నాళ్లు ఇదొక యాక్షన్ సినిమా అనుకుని నేను చూడలేదు. కాస్త ఆలస్యంగా ఈ సినిమాను చూసినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావడం చాలా ఆనందకర విషయం.

ఇదే సినిమాను తెలుగులో స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ వంటి వారు చేయడం నిజంగా అభినందనీయం అంటూ పేర్కొంది. ఇలాంటి సున్నితమైన అంశాలపై స్టార్ హీరోలు ఆసక్తి చూపించి నటించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం అంటూ పేర్కొంది. స్టార్స్ ఇలాంటి సినిమాల్లో నటించడం వల్ల చెప్పాలనుకున్న మెసేజ్ చాలా మందికి చేరుతుంది. తద్వారా మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది