నీటి ట్యాంకర్ తో గుద్ది చంపేస్తా! వడివేలు

0

తమిళ హాస్య నటుడు వడివేలుకు వివాదాలు కొత్తేంకాదు. ఇటీవలి కాలంలో వివాదాల్లో వడివేలు పేరు మరీ హైలైట్ అవుతోంది. దర్శకుడు శంకర్ తోనే లొల్లిపెట్టుకుని పంచాయతీకి ఎక్కాడు. ఇంసై అసరన్ 23 ఆమ్- పులకేసి-2 చిత్రాలకు సంబంధించిన వివాదం ఇప్పటి వరకూ ఇద్దరి మధ్య సద్దుమణగలేదు. కేసు విచారణలో ఉంది. షూటింగ్ లను మధ్యలోనే బ్రేక్ చేసి వెళ్లిపోవడంతో శంకర్ 4 కోట్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వడివేలుదే తప్పు అన్నట్లు కోలీవుడ్ మీడియా సైతం ఎలివేట్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా వడివేలు మరో వివాదంలోనూ ఇరుక్కోవడం చర్చకొచ్చింది.

మధురై- పుదూరుకు చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి పుదూర్ పోలీస్ స్టేషన్ లో వడివేలుపై ఫిర్యాదు చేయడం తోనే ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. సతీష్ పుదూర్ లోరియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన ఆఫీస్ లో గోవిందరాజు అనే వ్యక్తి నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అయితే వడివేలు మేనేజర్ మణికంఠన్ అనే వ్యక్తి ఆ ఇద్దర్ని బెదిరించాడుట. గతంలో సతీష్ వడివేలుతో ఓ సినిమా చేసాడుట. దానికి సంబంధించిన డబ్బును వెంటనే సెటిల్ చేయకపోతే నీళ్ల లారీతో గుద్ది చంపేస్తానని మణికంఠన్ హెచ్చరించాడుట. ఇదంతా వడివేలు ప్రోద్భలంతోనే జరిగిందని సతీష్ పుదూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడుట.

పోలీసులు వడివేలు.. మణికంఠన్ పై కేసులు నమోదు చేసి విచారణకు సిద్దం అవుతున్నట్లు తెలిసింది. మణికంఠన్ పై పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు ముందుగా వడివేలును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు అన్న వార్త కోలీవుడ్ సహా టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోలీవుడ్ పరిశ్రమలో వడివేలుపై నెగిటివిటీ ఎక్కువైన నేపథ్యంలో తాజా వివాదం హాట్ టాపిక్ గా మారింది.
Please Read Disclaimer