జార్జిరెడ్డి వివాదం.. మరింత పబ్లిసిటీ

0

ఉస్మానియా యూనివర్శిటీ స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘జార్జిరెడ్డి’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. పాతికేళ్ల వయసులోనే చదువులోనూ ఉద్యమంలోనే సంచలనం సృష్టించిన జార్జిరెడ్డి జీవిత చరిత్రను వెండి తెరపై చూసేందుకు ప్రేక్షకులు అమితాశక్తితో ఉన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేరుతో సినిమాకు మంచి పబ్లిసిటీ దక్కింది. ఈ సమయంలోనే ఈ సినిమా చుట్టు వివాదం రాజుకుంది. దాంతో మీడియాలో ప్రముఖంగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంపై ఏబీవీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో ఏబీవీపీ స్టూడెంట్ లీడర్స్ ను రౌడీలుగా చిత్రీకరించారంటూ విమర్శించారు. జార్జిరెడ్డిపై 15 క్రిమినల్ కేసులు ఉన్నాయని.. వాటిని చూపించకుండా కేవలం హీరోగానే చూపించేందుకు ఈ సినిమాను తెరకెక్కించారంటూ ఏబీవీపీ నాయకులు అంటున్నారు. ఆయన క్రిమినల్ చరిత్రను కూడా సినిమాలో చూపించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. జార్జిరెడ్డి హత్య కేసులో ఏబీవీపీ విద్యార్థి నాయకుల హస్తం లేదంటూ గతంలోనే కోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ సినిమాలో మళ్లీ అదే విషయాన్ని ప్రస్తావించినట్లుగా వారు అంటున్నారు.

చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలను మళ్లీ ఇప్పుడు చూపిస్తూ ఏబీవీపీ కార్యకర్తలను రౌడీలుగా చిత్రీకరించేందుకు ఈ సినిమాలో ప్రయత్నించారంటూ వారు అభ్యంతరం చెబుతున్నారు. అయితే తమ సినిమాలో అన్ని వాస్తవాలను చూపిస్తామని.. ఏ ఒక్కరిని కాని ఏ ఒక్క సంస్థను కాని టార్గెట్ చేసి చూపించలేదంటూ దర్శకుడు జీవన్ రెడ్డి చెబుతున్నాడు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది సినిమాకు మీడియాలో ప్రచారం భారీగా జరుగుతోంది. దాంతో జార్జిరెడ్డికి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ రావడం కన్ఫర్మ్ అంటున్నారు.




Please Read Disclaimer