కవితలు అల్లుతున్న `కూలీ నెం 1` బ్యూటీ

0

యంగ్ సారా అలీఖాన్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో తెలిసినదే. 25 ఏళ్ల ఈ భామ ప్రస్తుతం తన కొత్త చిత్రం `కూలీ నెం 1` ప్రచారంలో బిజీగా ఉంది. తాజాగా ఇన్ స్టాలో కవితల్ని అల్లింది. అరుదుగానే సోషల్ మీడియాలో కనిపించిన సారా.. ఈ పోయెట్రీలో సారా కి షాయారీ టాపిక్ హీట్ పెంచుతోంది.

లిఫ్ట్ అండ్ సిట్.. టర్న్ అండ్ ట్విస్ట్.. సరదాగా ఉండటమే దీని సారాంశం.. ఇప్పుడు నేను దీనిని నా జాబితా నుండి తొలగిస్తాను.. సారా కి షయారి పూర్తిగా తప్పిపోయింది.. క్షమించండి అబ్బాయిలూ..!! నేను అడ్డుకోలేకపోయాను. నా కవిత కొట్టివేసారని ఆశిస్తున్నాను అంటూ పోయెట్రీ చెప్పింది సారా. అయితే తాను ఇలా చేయడానికి కారణం తన లేటెస్ట్ ఫోటోషూట్.

ఇటీవల సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న సారాను ఎన్.సి.బి విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి కారణమైన బాలీవుడ్ మాదకద్రవ్యాల ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి సెప్టెంబర్ లో సారా అలీ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పిలిపించింది. తన తొలి చిత్రం కేదార్ నాథ్ లో సుశాంత్ తో కలిసి నటించిన సారాను ఎన్.సిబి సెప్టెంబర్ 26 న ప్రశ్నించింది. ఆమె గోవా సెలవుదినం నుండి ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత సారా కొంత గ్యాప్ తర్వాత తిరిగి యథావిధిగా తన సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. ప్రస్తుతం షూటింగుల అప్ డేట్స్ సహా వ్యక్తిగత విషయాల్ని ఈ వేదికలపై ముచ్చటిస్తోంది.