అంతా అయిపోయాక కాపీ రైట్ పోరాటమా?

0

కాపీ రైట్ చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో పరిశ్రమలో చీటింగ్ కూడా అంతే జోరుగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరి క్రియేటివిటీని ఇంకొకరు దోచుకోవడంపై నిరంతర ఆరోపణలు చూస్తున్నదే. అయితే క్రియేటివిటీ కొట్టేసేవాళ్లు బలవంతులు అయితే ఇటువైపు ఎంత మొత్తుకున్నా న్యాయం జరగడం కష్టమే. కోర్టులు ఉన్నా చాలా సార్లు బలవంతులదే గెలుపు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఇటీవల బయటపడ్డాయి.

అయితే ఇటీవల బిగిల్ (విజిల్) కథ నాదే అంటూ రచయిత డాక్టర్ నంది చిన్ని కుమార్(హైదరాబాద్) కాపీ రైట్ చట్టాన్ని ఆశ్రయించారు. గచ్చిబౌళి పోలీస్ స్టేషన్ లో ఏజీఎస్ ప్రొడక్షన్స్ కంపెనీ సహా దర్శకుడు అట్లీపైనా.. అఖిలేష్ పాల్ పైనా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు మీడియాకి వివరాల్ని అందించారు కుమార్. స్పోర్ట్స్ పర్సనాలిటీ అఖిలేష్ పాల్ జీవితకథకు సంబంధించిన కాపీ రైట్స్ నా వద్ద ఉన్నాయి. ఆయన కథ నేను రాసుకున్నా. నాకు మాత్రమే ఆ కథపై రైట్స్ ఉన్నాయి. నా కథతో పాటు క్యారెక్టర్ కు బిగిల్ సినిమాతో పోలికలు ఉన్నాయి. సినిమాలో చాలా సీన్లు అలానే ఉన్నాయి! అంటూ అతడు ఫిర్యాదు చేశాడు. సౌతిండియా ఫిలింఛాంబర్ (చెన్నయ్)- తెలుగు ఫిలింఛాంబర్- తమిళ నిర్మాతల మండలి – సెన్సార్ బోర్డ్ ఇలా అందరికీ అతడు ఫిర్యాదు చేశాడట. రిలీజ్ ముందు ఫిర్యాదు చేస్తే దానికి ఎవరూ స్పందించలేదని తెలిపారు. అటు తమిళ నిర్మాత కానీ ఇటు తెలుగు నిర్మాత కానీ అస్సలు స్పందించలేదట. చివరికి రైట్స్ అమ్ముకున్న స్పోర్ట్స్ పర్సనాలిటీ అఖిలేష్ సైతం బిగిల్ రిలీజ్ ముందు చివరి మూడురోజులు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాట. అసలు ఫిర్యాదు చేయొద్దని హెచ్చరించారట. 2018 మార్చిలో ఆయన నుంచి రైట్స్ కొనుక్కున్నానని తెలిపారు.

తాజాగా అతడు మీడియాకి పంపిన లేఖలో ఈ సంగతుల్ని రివీల్ చేశారు. సెంట్రల్ సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తనకు న్యాయం జరగలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఫిలింస్టడీస్ లో డాక్టరేట్ చదివి హార్వార్డ్ యూనివర్శిటీలో డిప్లోమాలు చేసి ఇక్కడికి వచ్చి ప్రతిసారీ మోసపోయానని దర్శకనిర్మాతలు.. హీరోలు చీట్ చేసే నిర్మాతలకు అండగా నిలవొద్దని కోరారు. బిగిల్ (విజిల్) కాపీ రైట్స్ విషయంలో కోర్టుల పరిధిలో పోరాటం సాగిస్తానని తెలిపారు. ఫుట్ బాల్ నేపథ్యంలో బిగిల్ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్ చిన్ని కుమార్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత? అన్నది కాపీ రైట్ పరిధిలో కోర్టుల్లోనే పరిష్కారం లభించాల్సి ఉంటుంది. ఇప్పటికే సినిమా రిలీజైంది. రిజల్ట్ కూడా వచ్చేసింది.
Please Read Disclaimer