కరోనా ఎఫెక్ట్ : విద్యార్ధులకి శుభవార్త.. పరీక్షలు రాయకుండానే పైతరగతులకు!

0

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వణికిపోయేలా చేస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది మహమ్మారి. మొన్నటి వరకు చైనా దేశానికి మాత్రమే పరిమితమైన ఈ మహమ్మారి వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకు కూడా శరవేగంగా వ్యాప్తిచెందుతుంది. దీంతో ప్రపంచ దేశాలు ప్రాణభయంతో చిగురుటాకులా వణికిపోతున్నాయి. అయితే కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం మాత్రం పెరిగిపోతున్నది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించిన విషయం తెలిసిందే. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు భారతదేశంలో కఠిన నిబంధనలు అమలు లోకి వస్తుంది. అటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల సంక్షేమం కోసం..కరోనా వైరస్ ను నియంత్రించేందుకు అవగాహన చర్యలు చేపట్టడంతో పాటు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వాలు సెలవులు ఇచ్చాయి.

కొన్ని రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు సెలవులు ఇచ్చాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏప్రిల్ 2వ తేదీ వరకు విద్యా సంస్థలు మూసేశారు. అయితే మార్చి 31 తరువాత కూడా కరోనా కంట్రోల్ అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పదికి పైగా కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండవ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు.. వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతులకు పంపేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ వెల్లడించింది. యూపీలో ప్రైమరీ పాఠశాలలకు మార్చి 23 నుంచి 28 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యం లో ఆ పరీక్షలను రద్దు చేశారు. అలాగే కరోనా ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించకపోవడంతో వార్షిక పరీక్షలు రాయకుండానే విద్యార్థులని పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించారు.అలాగే వీలైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ప్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కంపెనీల యాజమాన్యాలకు ప్రభుత్వం సూచించింది.
Please Read Disclaimer