కరోనా ఎఫెక్ట్ : సూపర్ స్టార్ మూవీ వాయిదా

0

ప్రపంచంలోని అన్ని రంగాలను కరోనా వైరస్ ప్రభావితం చేస్తుంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ మెల్ల మెల్లగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 120 దేశాలకు పాకినట్లుగా తెలుస్తోంది. ఇండియాలో కూడా కరోనా కల్లోలం మొదలైంది. దేశంలో ఎక్కడ చూసినా కూడా కరోనా గురించి చర్చ జరుగుతోంది. కరోనా భయం తో కేరళ లో ఏకంగా థియేటర్లను ఈనెల చివరి వరకు మూసేయడం జరిగింది. ఇక ఇతర ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ ఉన్నా కూడా సినిమాలకు వెళ్లేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు.

ఈ సమయంలో పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపడం లేదు. టాలీవుడ్ లో మార్చి నెల పరీక్ష సీజన్ కనుక మామూలుగానే సినిమాలు ఉండవు. ఏప్రిల్ నుండి టాలీవుడ్ లో సినిమాల విడుదల ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సినిమాలకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఈ సమయంలోనే బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ సూర్యవంశీ విడుదల వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా కత్రీనా కైఫ్ హీరోయిన్ గా రోహిత్ శెట్టి దర్శకత్వంలో పోలీస్ స్టోరీతో రూపొందిన ఈ చిత్రం విడుదల విషయంలో సందిగ్దం నెలకొంది.

మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుని ఆమద్య మార్చి 24కు ప్రీపోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు తేదీల్లో కూడా ఈ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. సినిమా కొత్త విడుదల తేదీ విషయంలో త్వరలోనే యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన వస్తుందని అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-