కరోనా కారణంగా హీరో పెళ్లి గందరగోళం

0

యంగ్ హీరో నితిన్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెల్సిందే. ఇటీవలే భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి జోష్ లో ఉన్న నితిన్ పెళ్లిని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాడు. దుబాయిలో ఏప్రిల్ 16న పెళ్లి జరిపేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నితిన్ షాలిని ల వివాహంకు ఏర్పాట్లు జెట్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో కరోనా కాస్త ఇబ్బందులకు గురి చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయపెడుతున్న విషయం తెలిసిందే. కరోనా వల్ల ఇప్పటికే వేలాది మంది మృతి చెందారు. అందుకే ప్రతి దేశంలో కూడా కరోనా అలర్ట్ ఉంది. ప్రతి విమానాశ్రయాల్లో కూడా కరోనా వైరస్ జాగ్రత్తలు పతాక స్థాయిలో తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దుబాయిలో పెళ్లి అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటూ కొందరు నితిన్ అండ్ ఫ్యామిలీని హెచ్చరిస్తున్నారట.

దుబాయిలో పెళ్లికి ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్న నేపథ్యంలో నితిన్ ఫ్యామిలీ ఆలోచనల్లో పడ్డట్లు గా తెలుస్తోంది. కరోనా వైరస్ బారిన పడుకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా కూడా దేశం దాటుతున్నాం అంటే కాస్త రిస్క్ గానే అంతా భావిస్తున్నారు. అందుకే పెళ్లికి హాజరు అవ్వాల్సిన గెస్ట్ లు కూడా వెనుకంజ వేస్తున్నట్లు గా తెలుస్తోంది.

కరోనా భయం ఇంతగా ఉన్న ఈ సమయంలో దుబాయిలో పెళ్లి పెట్టుకోవడం అనేది మంచి నిర్ణయం కాదంటూ నితిన్ కు సన్నిహితులు సూచిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ లేదా ఇండియాలో మరెక్కడికైనా పెళ్లిని మార్చుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. ఈ గందరగోళం మద్య నితిన్ ఫ్యామిలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Please Read Disclaimer