హై అలెర్ట్: ఫిలింనగర్ లో కరోనా లొల్లి..!!

0

గ్లోబ్ ని గజగజ ఒణికిస్తోంది కరోనా. ఎటు చూసినా కోవిడ్ 19 వైరస్ కల్లోలమే. ఈ మహమ్మారీ భారిన పడి దాదాపు 7 వేల మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. లక్షమంది పైగా వైరస్ భారిన పడ్డారు. భారతదేశంలో 100 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఒకరి మరణం సంభవించడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ ప్రభుత్వాలు హై ఎలెర్ట్ ప్రకటించాయి. ఇక వినోద పరిశ్రమ కరోనా వల్ల అతలాకుతలం అయ్యింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్.. టాలీవుడ్ షూటింగులు బంద్ అంటూ దిగ్భందనం చేశారు. ఇక ఈ లొల్లి ఇక్కడితో పరిమితం అయ్యిందా? అంటే.. ఫిలింనగర్ లోనూ మరో తరహా లొల్లు ఓ రేంజులో ఉందని తెలుస్తోంది.

షూటింగులు బంద్ అని చాంబర్ వర్గాలు ప్రకటించగానే అన్ని నిర్మాణ సంస్థలు ప్రొడక్షన్ ని ఆపేశాయి. 24 శాఖల వాళ్లు స్వచ్ఛందంగా షూటింగులు విరమించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడ మరో కొత్త సమస్య రెడీ అయ్యింది. ఎవరికి వారు ఈ రెండు వారాల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారట. ఎవరికి వారు వాళ్ల సొంత ఆఫీసుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసేశారట. ఐతే .. ఇలా సొంతంగా ఆఫీసులు లేని వాళ్లు మాత్రం ప్రసాద్ లాబ్స్ సహా అందుబాటులో ఉన్న లాబ్స్ పై పడుతున్నారట. దీంతో ల్యాబులన్నీ కిటకిట లాడిపోతున్నాయని తెలుస్తోంది. ఆ ప్రభావంతో ల్యాబుల ముందు గుంపులు పెరుగుతున్నాయి. వాళ్ల వల్ల పబ్లిక్ ఒకేచోట చేరడం ఎక్కువై రేపో మాపో అవి కూడా మూసేసే పరిస్థితి రానుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జనసమ్మర్థమైన ప్రదేశాల్ని పోలీస్ నిషేధిస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యే సరికి.. ఎవరి సినిమాలు పూర్తిగా రెడీ చేస్తారో వాళ్ల సినిమాలకు మాత్రమే థియేటర్స్ ఇస్తారు ఎగ్జిబిటర్స్ కం డిస్ట్రిబ్యూటర్స్. కానీ ముందే డేట్స్ లాక్ చేసుకున్న వాళ్ల పరిస్థితి ఏమిటన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్న. .. మొత్తానికి కరోనా నిర్మాతల్ని అలా దెబ్బ కొడుతోందన్నమాట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-