సూపర్ స్టార్ కి కరోనా ఎఫెక్ట్.. కుటుంబంతో సహా క్వారంటైన్లోకి

0

కరోనా మహమ్మారి సామాన్యులను సెలబ్రిటీలను సైతం వదలడం లేదు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సినీ ప్రముఖులకు వైరస్ ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉంది. అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ కారు డ్రైవర్ అతడి వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో సల్మాన్ఖాన్ హోంక్వారంటైన్లోకి వెళ్లిపోయారు. అతని డ్రైవర్ అశోక్కు కరోనా పాజిటివ్ అని తేలగా.. సల్మాన్ ఖాన్ తనకు తానుగా 14 రోజులు ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

సల్మాన్ ఖాన్ తో పాటు అతడి కుటుంబం కూడా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండబోతున్నది. ప్రస్తుతం సల్మాన్ డ్రైవర్ అశోక్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. అయితే సల్మాన్ ఖాన్ ఆయన కుటుంబ సభ్యుల దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. తన సిబ్బందికి సల్మాన్ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు.

సల్మాన్ ఖాన్ క్వారంటైన్లోకి వెళ్లడంతో ఈ వారం ‘బిగ్ బాస్ 14’ ‘వీకెండ్ కా వార్’ ఎపిసోడ్ షూట్ చేయగలరా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సల్మాన్ ఖాన్ బిగ్బాస్ వీకెండ్ ఎపిసోడ్కి అందుబాటులోకి రాకపోతే.. షారుక్ ఖాన్ చెయ్యవచ్చు అని కూడా అంటున్నారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్స్ ప్రారంభం అవ్వగా.. సల్మాన్ ‘రాధే’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తుంది.