కరోనా సెలవులు: మన స్టార్లు ఏం చేస్తున్నారంటే?

0

ఒక్కోసారి చెడు కూడా మంచికే దారి తీస్తుంది. అదెలాగంటారా? మన స్టార్ హీరోల్ని చూస్తే ఇప్పుడు ఆ విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఓవైపు కరోనా కల్లోలం వల్ల ముప్పు ఎట్నుంచి ఎటాక్ చేస్తుందోనన్న ఆందోళన అందరికీ ఉంది. దీంతో ప్రతి ఒక్క డిపార్ట్ మెంట్ కి సెలవులు ఇచ్చేశారు. స్కూళ్లు.. కాలేజ్ లు.. థియేటర్లు.. వీటికి తోడు హీరోలకు కూడా సెలవులు దొరికేశాయి. దీంతో ఇప్పుడు మన స్టార్ హీరోలంతా ఏం చేస్తున్నారు?

షూటింగులు లేకపోతే ఖాళీగా కూచుని గోళ్లు గిల్లుకుంటున్నారా? అంటే.. అబ్బే ఈ సమయాన్ని ఎంతో తెలివిగా సద్వినియోగం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంట్లో ఫ్యామిలీకి టైమ్ కేటాయిస్తున్నారు. పనిలో పనిగా దొరికిన సినిమాలన్నీ టీవీల్లో హోమ్ థియేటర్లలో చూసేస్తున్నారు. కొందరు హీరోలు అయితే కుటుంబ సమేతంగా కూచుని ప్రొజెక్షన్ వేసుకుని మరీ చూసేస్తున్నారు.

పెద్ద స్టార్ చిన్న స్టార్ అనే తేడా ఏం లేదు. అందరికీ ఇప్పుడు ఖాళీ. బోలెడంత సమయం చిక్కింది. సూపర్ స్టార్ మహేష్ నుంచి సందీప్ కిషన్ వరకూ అందరికీ సెలవులు దొరికేశాయి కాబట్టి వీళ్లంతా సినిమాలు చూసే పనిలో ఉన్నారు. పనిలో పనిగా కొత్త దర్శకులు.. రచయితలు వినిపించే కథల్ని కూడా వినేస్తున్నారట. అసలు క్షణం తీరిక లేనంత బిజీ షెడ్యూల్స్ వల్ల ఎవరైనా కథ వినిపిస్తామంటే వారాలు నెలలు తిప్పుకునేవారు. ఇప్పుడు కావాల్సినంత టైమ్ దొరికింది కాబట్టి అందరికీ స్కోప్ దొరుకుతోంది. కాదు.. వద్దు అని తిప్పి పంపకుండా ఖాళీ సమయాల్లో స్క్రిప్టులు వినేసి అందులో నచ్చిన వాటిని హోల్డ్ లో పెడుతున్నారట. ఇలా చేస్తే కథ.. కాకరకాయ లేని సినిమాల్లో నటిస్తున్నారు అంటూ గగ్గోలు పెట్టాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కరికీ స్క్రిప్టులు వినే టైమ్ ఉంటోంది కాబట్టి మంచి వాటిని వెతికేందుకు సమయం చిక్కినట్టే. ఇది మంచికే కదా!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-