సామ్-చైతన్యలపై ఆ పుకార్లకు చెక్

0

ప్రస్తుతం హైదరాబాద్ ని కొవిడ్ మహమ్మారీ ఒణికిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 1000 కేసులకు చేరువలో ఉంది సిటీ. ఇది షూటింగులకు ఇబ్బందికరంగా మారడమే గాక.. సెలబ్రిటీల్లోనూ కల్లోలం సృష్టిస్తోంది. అరడజను పైగానే స్టార్ల పేర్లు వినిపిస్తున్నాయి. టీవీ సీరియల్ నటులకు కరోనా అన్న వార్తలతో ఒక్కసారిగా బెంబేలెత్తారు. మొన్నటికి మొన్న అక్కినేని కోడలు సమంత బెస్ట్ ఫ్రెండ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఆమె భర్త ప్రీతం రెడ్డి కోవిడ్ -19 పాజిటివ్ అన్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ ఇద్దరినీ డాక్టర్లు పరీక్షించినప్పటి నుండి ఒకటే కలకలం. ముఖ్యంగా భార్యాభర్తలు సమంత- నాగ చైతన్యలకు పరీక్షించగా పాజిటివ్ అన్న పుకార్లు షికారు చేశాయి. టాలీవుడ్ యువ జంటపై ఈ తరహా పుకార్లు వేగంగా వ్యాపించడంతో ఆ ఇద్దరితో సన్నిహితం గా ఉన్న చాలా మంది లో ఒణుకు పుట్టింది అంటూ బోలెడంత ప్రచారం సాగిపోయింది.

అయితే తాజా సోర్స్ ప్రకారం.. సామ్- చైతన్య సేఫ్ అని తెలిసింది. ఆ ఇద్దరికీ నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిందట. శిల్పా రెడ్డికి పాజిటివ్ అని తేలినప్పటి నుంచి మరింత గా జాగ్రత్తలు తీసుకున్న అక్కినేని కుటుంబం స్వీయ దిగ్బంధనంలో ఉంది. పక్కాగా కోవిడ్ భద్రతా మార్గ దర్శకాలను పాటిస్తున్నారట. యువజంట సేఫ్ అన్న తాజా వార్తతో ఫ్యాన్స్ కి బంధుమిత్రులకు ఊరట దక్కినట్టే.
Please Read Disclaimer