కరోనాపై టాలీవుడ్ లో స్క్రిప్టులు రెడీ!

0

సహజంగా వైరస్ లపై కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేయడం హాలీవుడ్ కే పరిమితం. ఇలాంటి కథలు అక్కడే పుడతాయి. ఉన్న వైరస్ లపై…ఫ్యూచర్ లో పుట్టుకొచ్చే వైరస్ లపై పరిశోధన నేపథ్యం…వైరస్ లపై ఎలా పోరాడాలి? ఇలాంటి వైపరిత్యాల వేళ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటివన్నీ సినిమాగా చూపించడం అంటే అదో సవాల్. అలాంటి స్క్రిప్ట్ లను ఆసక్తికరంగా వండి వార్చే ట్యాలెంట్ హాలీవుడ్ రైటర్లకు.. దర్శకులకే ఉంది. రెసిడెంట్ ఈవిల్ ఫ్రాంఛైజీ తరహాలో జాంబీ మూవీస్ ఇందుకు చక్కని ఎగ్జాంపుల్.

ప్రస్తుతం కరోనా (కొవిడ్-19) ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయానక వైరస్ గా పాపులరైంది. మూడు దేశాలు మినహా దాదాపు ప్రపంచాన్ని చుట్టేసింది ఈ మహమ్మారీ. శాస్త్ర వేత్తల మేథస్సుకే సవాల్ గా మారిన వైరస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా దీని భారిన పడిన వారిలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగడం భయపెట్టేస్తోంది.

ఇప్పటివరకూ మందు లేదు..టీకా లేదు. వైరస్ సోకితే బతికి బట్ట గట్టడం ఎలా? అంటూ ప్రపంచ దేశాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి. ఐక్యరాజ్య సమితిలోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం మహామ్మారీ ఇదని ప్రకటించింది. అంటే ఇది ప్రకృతి వైపరీత్యం.. భీభత్సంగా రికార్డుల్లో నమోదైంది. ఇప్పటికైతే ఎవరూ ఏదీ చేయలేరని అన్నిచోట్లా చేతులేత్తేయడం భయోత్పాతంగా మారింది. ఈ విపత్తు ఐరాసకే పెను సవాల్ గా మారింది. ఈ వైరస్ కు మందు కనిపెట్టాలని.. ఎలాగైనా బయటపడేయాలని నిరంతరం సైంటిస్టులు ల్యాబు ల్లో పరిశోధనాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఆంశాలే కొంత మంది టాలీవుడ్ రైటర్లకు మంచి కథలుగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. నవతరం రచయితలు ఈ పాయింట్ తో సినిమా చేస్తే బాగుటుందని ఆలోచన చేస్తున్నారుట.

మందు లేని రోగం కాబట్టి మందు దొరికే వరకరూ హాట్ టాపికే. ఈలోపే సినిమా చేసి జనాల్లోకి వదిలితే క్రేజీ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారుట. ఆలోచనైతే బాగుంది కానీ.. ఇది అనుకున్నంత ఈజీ కాదు. వైరస్ లపై స్క్రిప్ట్ అంటే చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ని సినిమాటిక్ గా మలచడం అంతకు మించిన సవాల్. అంత ట్యాలెంట్ ఇక్కడ ఉందా? ఉన్నా కానీ.. రెసిడెంట్ ఈవిల్ తరహాలో అంత టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా కరోనా అన్నది యూనివర్శల్ కాన్సెప్ట్. పాన్ ఇండియా కేటగిరీ కాబట్టి బడ్జెట్లు ఆ రేంజులోనే ఉండాలి. ఇప్పటికే హాలీవుడ్ మేకర్స్ కరోనా వైరస్ పరిణామాలపై సినిమా చేసేందుకు రీసెర్చ్ కూడా మొదులు పెట్టేసి ఉంటారు. ఒక్క వైరస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు.. విమానయాన రంగాలు.. వినోద పరిశ్రమలు.. ఇతర అన్ని పరిశ్రమలు ఎలా అల్లకల్లోలం అయ్యాయో సినిమాగా చూపిస్తారేమో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-