భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం - LIVE

బిగ్ బాస్ షో నిలిపివేత.. విన్నర్‌ని ప్రకటిస్తూ సూపర్ స్టార్ షాకింగ్ నిర్ణయం

0

బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది సంచలన నిర్ణయం. తమ షోకి అవాంతరాలు ఎదురైనా, నిరసనలు చెలరేగినా, కోర్టుల్లో కేసులు వేసినా ఎప్పుడూ వెనకుడుగు వేయని బిగ్ బాస్ నిర్వాహకులు తొలిసారి కరోనా ఎఫెక్ట్‌తో బిగ్ బాస్ షో‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ షో నిలిపివేస్తూ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా విజృంభిస్తుండటంతో బిగ్ బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్, ఈ షోకి పనిచేసే సిబ్బంది ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ నిర్ణయానికి వచ్చినట్టు షో నిర్వాహకులు తెలిపారు.

అనేక వివాదాల మధ్య కొనసాగుతున్న మలయాళ బిగ్ బాస్ షోను శుక్రవారం నాటితో ముగించారు. 75 రోజులుగా సాగుతున్న ఈ షోలో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. అయితే తాజా ఎపిసోడ్‌లో షోని నిలిపివేస్తున్నట్టు కంటెస్టెంట్స్‌కి తెలియజేశారు మోహన్ లాల్. కరోనా ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే తాజా ఎపిసోడ్‌లో మోహన్ లాల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి.. 10 సెలబ్రిటీలతో మచ్చటించారు. ప్రస్తుతం బయట కరోనా ప్రభావం ఎలా ఉందో వారికి వివరిస్తూ.. ప్రజాఆరోగ్యం దృష్ట్యా సీజన్ 2ని ముగిస్తున్నామని తెలిపడంలో షాక్‌కి గురయ్యారు కంటెస్టెంట్స్. అనంతరం హౌస్‌లో ఉన్న 10 సెలబ్రిటీలను విజేతలుగా ప్రకటిస్తూ వాళ్లకు బిగ్ బాస్ సీజన్ 2 ట్రోఫీని అందించారు మోహన్ లాల్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-