టాలీవుడ్ షూటింగులపై కరోనా ఎఫెక్ట్

0

కరోనా కల్లోలం అన్ని ఇండస్ట్రీల్ని చుట్టేస్తోంది. ప్రస్తుతం భారత్ లో అందునా హైదరాబాద్ లో కరోనా వ్యాప్తిపై తీవ్ర ఆందోళన నెలకొంది. దీని ప్రభావం సినీఇండస్ట్రీపైనా దారుణంగా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్లకు జనం వెళతారా? అన్న సందిగ్ధత వ్యక్తమవుతోంది.

ఇప్పుడు షూటింగుల్ని కొన్నాళ్లపాటు ఆపేసే పరిస్థితి కనిపిస్తోందని వినిపిస్తోంది. సెట్స్ లో ఇకపై స్ట్రిక్ట్ రూల్స్ ని అమల్లోకి తెస్తున్నారన్నది తాజా సమాచారం. ఈ గురువారం నుంచి అన్ని మూవీ సెట్స్ లో మాస్కులు సప్లయ్ చేయాల్సిందేనని ప్రొడక్షన్ వాళ్లకు ఛాంబర్ నుంచి మెసేజ్ వెళ్లింది. అలానే తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి.

వైరస్ వ్యాప్తి తగ్గ వరకూ సినిమా షూటింగుల్ని కంట్రోల్డ్ గా చేయాలని తగ్గించాలని నిర్మాతల మండలి సైతం తీర్మానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ కరోనా ప్రభావం ఎక్కువైతే ఆ ప్రభావం థియేటర్స్ పైనా దారుణంగా పడే అవకాశం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కరోనా తాకిడి టాలీవుడ్ పై మరో లెవల్లో ఉందని తాజా సన్నివేశం క్లియర్ కట్ గా చెబుతోంది. ఇప్పటికే సెట్స్ పై ఉన్న వంద సినిమాలకు ఇది పెను ముప్పేనని అర్థమవుతోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-