కరోనా లాంటి వైరస్ తో సినిమా.. ఫుల్ డిమాండ్!

0

ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా జపమే. మాస్కుల కోసం.. శానిటైజర్ల కోసం తెగ డిమాండ్ ఏర్పడింది. పక్కవాడు తుమ్మితే చాలు.. వణికిపోతున్నారు. చైనా రిటర్న్డ్ అని చెప్తే అమెరికా రిటర్న్డ్ కంటే గొప్పగా చూసే జనాలు ఇప్పుడు చైనా అంటే చాలు.. బడితపూజ చేసేలా ఉన్నారు. ముక్క లేందే ముద్ద దిగని నాన్ వేజిటేరియన్స్ కే కడుపు లో తిప్పే మహా నాన్ వెజ్ డిషెస్ వుహాన్ వంటలు – పిండివంటలు పేరుతో వాట్సాపులో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ సమయంలో ఒక అంటువ్యాధి మీద తీసిన హాలీవుడ్ సినిమా హాట్ టాపిక్ గా మారింది. అది ఇప్పటి సినిమా కాదు. 2011 లో విడుదలైన ‘కాంటేజియన్’. ఈ సినిమా కథ ఊహాజనితమైన MEV-1 వైరస్ మనుషులకు సోకడం.. తదనంతర పరిణామాల చుట్టూ తిరుగుతుంది. అది కూడా ఈ కరోనావైరస్ తరహాలోనే ప్రాణాంతకమైంది. గ్వెనెత్ పాల్ట్రో ఒక బిజినెస్ ట్రిప్ లో భాగంగా హాంక్ కాంగ్ కు వెళ్తుంది అక్కడ ఆ మాయదారి MEV-1 వైరస్ గ్వెనెత్ కు అంటుకుంటుంది. ఆమె అమెరికాకు తిరిగి వచ్చిన తర్వాత ఆ వైరస్ చాలామందికి సోకుతుంది. నెల రోజుల సమయంలోనే పాతిక లక్షల మంది అమెరికన్లు మృత్యువాత పడతారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆ వైరస్ కారణంగా మరణాలు నమోదవుతాయి. ఈ వైరస్ ను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు.. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా లో చూపిస్తారు.

ఈ సినిమా చూస్తుంటే అందరికీ కరోనా వైరస్ గుర్తుకు వస్తూ ఉండడంతో ఈ సినిమా ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాలో చూపించినంత భయంకరంగా ప్రస్తుత పరిస్థితి లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-