బట్టలిప్పి ప్రీ వెడ్డింగ్ నా? కొత్త జంట పై ట్రోలింగ్?

0

ఓ కొత్త జంట ప్రీ వెడ్డింగ్ పేరుతో బట్టలు విప్పి దుప్పట్లు కప్పుకొని ఫొటో వీడియోలతో షూట్ చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళకు చెందిన నవ దంపతులు రిషి కార్తికేయన్ లక్ష్మీ ఇలా ప్రీ వెడ్డింగ్ చేసుకున్నారు.

కోవిడ్19 నేపథ్యంలో సెప్టెంబర్ 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరువర్గాల పెద్దలు వీరి వివాహ తంతును జరిపించారు. కరోనా కారణంగా పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి సింపుల్ గా జరిగింది.

అయితే పోస్ట్-వెడ్డింగ్ షూట్ అయినా కాస్త వెరైటీగా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు కొత్త జంట. ఈ మేరకు ఫొటో గ్రాఫర్ అయిన తమ స్నేహితుడితో ఈ ఆలోచనను పంచుకున్నారు.

ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఇడుక్కిలోని తేయాకు తోటలకు చేరుకున్నారు. తమ ప్రణయ బంధం ప్రతిబింబించేలా ఫొటోలు వీడియోలు ప్రీ వెడ్డింగ్ షూట్ తీయించుకున్నారు.

అయితే తీయించుకున్నవారు గమ్మున ఉంటే అయిపోయేది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి రుషి-లక్ష్మీల మీద ట్రోలింగ్ మొదలైంది. తెల్లటి దుప్పటి కప్పుకొని సినిమా స్టైల్ లో బట్టలు లేకుండా పరుగులు తీస్తున్న ఈ ఫొటోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫొటోలతో ఏం మెసేజ్ ఇస్తున్నారని నిలదీశారు. వీరిద్దరిని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు.

ఈ విషయంపై వధువు లక్ష్మీ స్పందించారు. ఆఫ్ షోల్డర్ టాప్స్ ధరించే వారికి ఇది కొత్తగా అనిపించకపోవచ్చు. అయినా మేం ఏ తప్పు చేయలేదు. నిందించకండి.. చూసే కళ్లను బట్టే ఉంటుంది’ అంటూ విమర్శలకు బదులిచ్చారు.