మాల్దీవుల్లో జంటల వీరవిహారం

0

ముచ్చటైన జంటలకు మాల్దీవుల విహారం అన్నిరకాలుగా కలిసొస్తోందనే అర్థమవుతోంది. అన్ని టెన్షన్స్ ని విడిచిపెట్టి అద్భుతమైన రసాస్వాధనలు ఆస్వాధిస్తున్నారని ఇటీవల సోషల్ మీడియాల్లో షేర్ చేసిన స్టార్ కపుల్ జంట ఫోటోలు వెల్లడిస్తున్నాయి.

ఎన్నడూ లేనంతగా ఈసారి బాలీవుడ్ టాలీవుడ్ నుంచి జంటలు జంటలుగా మాల్దీవుల బీచ్ లను పావనం చేయడం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. కపుల్ గోల్స్! అంటూ బికినీ బీచ్ సెలబ్రేషన్ తో జంటలు అట్టుడికిస్తున్న తీరు ప్రముఖంగా చర్చకు వచ్చింది. ఈసారి ఎన్ని జంటలు మాల్దీవుల విహారంలో చిలౌట్ చేశాయి? అంటే..

2020 హాటెస్ట్ జంటలుగా చైతన్య -సమంత జోడీ.. కాజల్ – కిచ్లు జోడీ పాపులరయ్యారు. సామ్ .. కాజల్ ఎంతో డీసెంట్ గా బీచ్ సెలబ్రేషన్ ని ఆస్వాధించడం చర్చకు వచ్చింది. కాజల్ కిచ్లు హనీమూన్ అంతా ఇక్కడే. వీరంతా అండర్ వాటర్ సాహసాలు చేయడం మరో విశేషం.

షాహిద్ కపూర్ – మీరా రాజ్ పుత్.. దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ (విడిపోయి కలిసిన జంట) ఈ సీజన్ లో మాల్దీవుల విహారం చేశారు. బిపాస బసు- కరణ్ సింగ్ గ్రోవర్.. జహీర్- సాగరిక జంట కూడా మాల్దీవుల విహారంలో చిలౌట్ చేశారు. కొత్త గా పెళ్లయిన జంటలకు బెస్ట్ హనీమూన్ స్పాట్ గా మాల్దీవులకు ఐడెంటిటీ ఉంది. ఇలాంటి చోట జంటలన్నీ షికార్ చేస్తూ తమ సెలబ్రేషన్ ఫోటోల్ని షేర్ చేయడంతో అంతర్జాలంలో సమ్మర్ హీట్ రాజుకుంది.