శరత్ కుమార్..రాధికను అరెస్ట్ చేయమన్న కోర్టు

0

ప్రముఖ సినీ నటులు శరత్ కుమార్.. రాధికలను అరెస్ట్ చేసేందుకు వీలుగా తాజాగా కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. చెక్కు బౌన్స్ అయిన కేసులో శరత్ కుమార్.. రాధిక దంపతులను అరెస్ట్ చేయాలని సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే..

నటులు శరత్ కుమార్.. రాధిక దంపతులు రేడియన్స్ మీడియా సంస్థకుచెందిన లిస్టిన్ స్టీఫెన్ తో కలిసి కొన్ని సినిమాల్ని నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్ మీడియా సంస్థ నుంచి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించేందుకు వీలుగా రూ.2కోట్ల చెక్కును ఇచ్చారు. అయితే.. ఆ చెక్కు బ్యాంకులో వేయగా.. నిధులు లేవని బౌన్స్ అయ్యింది.

దీంతో రేడియన్స్ మీడియా సంస్థ డబ్బులు అడగటం.. అందుకు శరత్ కుమార్.. రాధిక దంపతుల నుంచి స్పందన లేకపోవటంతో కోర్టును ఆశ్రయించారు. సైదాబాద్ కోర్టులో ఈ కేసును నమోదు చేశారు. తాజా విచారణలో హాజరు కావాలంటూ శరత్ కుమార్.. రాధికలకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అయితే.. కేసు విచారణకు వీరిద్దరూ రాలేదు. దీంతో వారిని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుతదుపరి విచారణను జులై 12కు వాయిదా వేశారు. మరీ.. వ్యవహారంపై శరత్ కుమార్.. రాధికలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Please Read Disclaimer