స్టార్ హీరోయిన్ పై ఎంక్వౌయిరీకి కోర్టు ఆదేశం

0

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంది. ఈ ఏడాది ఆరంభం నుండి ఈమె మరీ ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ వస్తుంది. సుశాంత్ మృతి చెందినప్పటి నుండి బాలీవుడ్ లో కొందరిని టార్గెట్ చేసి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత డ్రగ్స్ కేసులో ఏకంగా మహా రాష్ట్ర ప్రభుత్వంను ఇరుకున పెట్టేలా చేసింది. సీఎం ఠాక్రే మరియు ఆయన కొడుకుపై కూడా వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపింది. ముంబయిని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటూ పోల్చడంతో వివాదం మరింత పెరిగింది. ఈ సమయంలోనే కంగనా మరియు ఆమె సోదరి రంగోలీ మత విద్వేశాలను రెచ్చగొట్టేలా.. సామాజిక వర్గాల మద్య గొడవలు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతో పాటు మీడియాలో మాట్లాడుతున్నారు అంటూ అంధేరీ మెజిస్ట్రేట్ కోర్టులో అలీ కాసిఫ్ ఖాన్ దేశ్ ముఖ్ అనే లాయర్ పిటీషన్ వేశాడు.

కోర్టు ఆ పిటీషన్ ను విచారణకు స్వీకరించింది. అలీ కాసిఫ్ చేసిన ఆరోపణల విషయమై ఎంక్వౌరీ చేయాల్సిందిగా ముంబయి పోలీసులను కోర్టు ఆదేశించింది. వారు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను మరియు మీడియాల్లో మాట్లాడిన సందర్బంగా వారు చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి డిసెంబర్ 5వ తారీకు వరకు తమకు నివేదిక ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది. ముంబయి పోలీసులు ఇప్పటికే కంగనా సిస్టర్స్ పై కోపంతో ఉన్నారు. కనుక ఈ కేసులో వారికి వ్యతిరేకంగా కోర్టకు బలమైన వాదనలు వినిపించే అవకాశం ఉందని.. దాంతో కంగనా సిస్టర్స్ కు శిక్ష పడే అవకాశం ఉందంటూ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.