స్టార్ హీరో సినిమా ప్రొడక్షన్ లో లుకలుకలు ?

0

ఒకేసారి రెండు పెద్ద ప్రొడక్షన్ హౌసులు కలిసి ఒకే సినిమా తీస్తున్నప్పుడు బయటికి కనిపించకుండా లోపల చాలా వ్యవహారాలు అంతర్గత విభేదాలు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అవి లీక్ కాకుండా సదరు యూనిట్లు జాగ్రత్త పడుతాయి. ఇది కూడా అలాంటి సంఘటనే కానీ ఇందులో చాలా కోణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అతనో స్టార్ హీరో. ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఇటీవలే ఓ క్రేజీ దర్శకుడితో సినిమా మొదలుపెట్టుకున్నాడు. ఇతని తండ్రి స్వంత బ్యానర్ తో పాటు దర్శకుడి భాగస్వామ్యం ఉన్న మరో నిర్మాణ సంస్థ కలిసి దీన్ని నిర్మిస్తున్నాయి.

తనకు పారితోషికం బదులు నాన్ థియేట్రికల్ రైట్స్ ఇమ్మని హీరో డిమాండ్. నాన్నకు ఓకే కానీ మరో పార్టనర్ గా ఉన్న ప్రొడ్యూసర్ కి ఇది బొత్తిగా ఇష్టం లేదు. దీంతో సెట్లో జరుగుతున్న విషయాలను మెల్లగా మీడియాకు లీక్ చేయడం మొదలుపెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్ తో జరిగిన గొడవ – కొన్ని సన్నివేశాలు ఇంకో హీరో డిజాస్టర్ ను పోలి ఉండటం లాంటి బైట్స్ పత్రికల్లో రావడానికి కారణం సదరు ఇంకో నిర్మాతేనని హీరోకు అతని తండ్రికి డౌట్ వచ్చింది.

తీరా ఆరాతీస్తే కొంతవరకు నిజమనిపించే ఆధారాలు దొరికాయట. దీంతో రెండు బ్యానర్ల యూనిట్ల మధ్య విభేదాలు సాగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. యాభై కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే బోలెడు బజ్ ఉంది. ఇప్పుడీ ప్రచారం జరగడం పట్ల హీరో అసహనంగా ఉన్నప్పటికీ వాటిని కంట్రోల్ చేయడం ఎలాగో తెలియక ఇంటి దొంగను ఆపేదెలాగో అర్థం కాక తెగ వర్రీ అవుతున్నట్టు వినికిడి. అంతే ఒక్కోసారి చిన్న పరిణామాలు కమ్యూనికేషన్ గ్యాప్ లు ఇలాంటివాటికి దారి తీస్తాయి
Please Read Disclaimer