వరుణ్ తేజ్ కోసం క్రేజీ బాలీవుడ్ భామ?

0

ఈమధ్య బాలీవుడ్ లో భారీ క్రేజ్ సాధించిన హీరోయిన్లలో కియారా అద్వాని ఒకరు. ముఖ్యంగా ‘కబీర్ సింగ్’ తర్వాత కియారాకు డిమాండ్ పెరిగింది. అటు బాలీవుడ్ సినిమాలే కాదు కియారా టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కియారా ఆ సినిమా తర్వాత చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. ఇప్పుడు కియారాకు మరో ఆఫర్ వచ్చిందట.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాలోనే కియారాను హీరోయిన్ గా తీసుకునేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయట. ఇంకా కియారా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట. కియారాకు టాలీవుడ్ సినిమాలో నటించేందుకు అభ్యంతరం లేదు కానీ తన డైరీ ఖాళీ లేకపోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయగలనా లేదా అని ఆలోచిస్తోందట. ఒకవేళ డేట్స్ సర్దుబాటు చేయగలిగితే మాత్రం కియారా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో రోమాన్స్ చేయడం పక్కా అని అంటున్నారు.

ఇక ఈ సినిమా గురించి మరో అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో ఒక కీలకపాత్రకు బాలీవుడ్ హీరోను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంలో కూడా చర్చలు సాగుతున్నాయని.. త్వరలోనే ఈ విషయంలో కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్.. మరో బాలీవుడ్ హీరోను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నరంటే ఈ సినిమాకు ప్యాన్ ఇండియా అప్పీల్ తీసుకురావడం కోసం ట్రై చేస్తున్నారనుకోవచ్చు.
Please Read Disclaimer