పారితోషికం కింద డ్యూప్లెక్స్ పుచ్చుకున్న యువహీరో!

0

ఆయనో యువ హీరో.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన లక్కును చూసి కొందరు యువహీరోలు అదేపనిగా ఈనో ను వాటర్ లో కలుపుకుని తాగుతూ ఉంటారని కూడా టాక్ ఉంది. ఈ యువ హీరో నటించిన సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు పారితోషికం గట్టిగా పుచ్చుకున్నాడట. ఈ హీరో ఫీజును స్థిరాస్తి రూపంలో సంగ్రహించారట. దీంతో హీరో తెలివితేటలకు బతక నేర్చిన లౌక్యానికి చాలామంది ముచ్చట పడుతున్నారట.

హైదరాబాద్ ఫిలిం నగర్ లోని ఫిలిం ఛాంబర్ కు సమీపంలో ఈ సినిమా నిర్మాతకు ఒక డ్యూప్లెక్స్ హౌస్ ఉందట. ఈ ఇంటిని పారితోషికం కింద తీసుకున్నాడట. అది కూడా ఇంటి రిజిస్ట్రేషన్ తనపేరు మీద చేయించుకున్న తర్వాతే సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం ప్రారంభించాడట. నిజానికి సినిమా అవుట్ పుట్ ఆశించిన స్థాయిలో రాలేదట.. అయితే ఇల్లు తనకు వచ్చిన తర్వాత సినిమాలో మార్పు చేర్పులు సూచించాడట. కొన్ని సీన్స్ కు కొత్త వెర్షన్ రెడీ చేయించి మరీ రీషూట్స్ చేయించాడట. ప్రస్తుతం ఈ యువ హీరో హవా సాగుతోంది కాబట్టి దర్శకుడు.. నిర్మాత ఇద్దరూ దానికి ఒప్పుకున్నారట.

ఇంత ఇన్వాల్వ్ అయ్యి మరీ సినిమాకు మార్పు చేర్పులు చేసినప్పటికీ ఫలితం ఎలా ఉంటుందో అనే ఆందోళన మాత్రం నిర్మాతకు ఇంకా ఉందట. ఈ సినిమా విజయం ఫిలిం యూనిట్ లో అందరికీ ముఖ్యమే. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి .