క్రేజీ స్టార్ ని రౌండప్ చేసిన వ్యాపారులు

0

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఇంటిని చిరు వ్యాపారులు ముట్టడించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయ్ డౌన్ డౌన్! అంటూ వ్యాపారులు నినాదాలతో హోరోత్తించారట. ఇంతకీ వ్యాపారుల ఆగ్రహానికి అతడు ఎందుకు కారకుడయ్యాడు? అంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.

విజయ్ ఇటీవల మండి అనే ఆన్ లైన్ ప్రచార యాప్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ వ్యాపారంతో చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. మండిని విజయ్ ప్రోత్సహించడాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. తమ పొట్ట కొట్టే పని చేసినందుకు అతడిని నిలదీసే ప్రయత్నం చేశారట.

సినిమాల్లో నీతులు చెప్పే హీరోలంతా ..రియల్ లైఫ్ లో ఆ నీతులు ఫాలో అవ్వరా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. హీరోల కుటుంబాలు సుఖసంతోషాలతో బావుండాలి. మాలాంటి చిన్న వాళ్లు రోడ్డున పడాలా? అంటూ నిలదీసారు. అయితే ఈ విషయంపై ముందుగా పోలీసులకు సమాచారం అదడంతో అప్పటికే విజయ్ ఇంటికి రక్షణ కల్పించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని ఒక కళ్యాణ మండపంలో బంధించారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా పోలీసుల పహరాలో ఉన్నట్లు సమాచారం.

కేవలం యాప్ ప్రచారంతోనే సదరు హీరో అంత నష్టం చేసాడని వ్యాపారులు తిరగబడ్డారు. మరి మన హీరోలు పురుగుల ముందుల అవశేషాలు కలిపే కోలాలు.. ఫ్రూటీలకు ప్రచారం చేస్తున్నారు. రసాయనాలు నింపేసే చిరు తిండి ప్యాకేజ్డ్ ఉత్పత్తులకు .. పాల ఉత్పత్తులకు.. సౌందర్యం పెంచుతామని భ్రమింపజేసే ఉత్పత్తులకు.. ప్రజల్ని కష్టాలకు గురి చేసే కొన్ని ఛీప్ ట్రిక్ మాయగాళ్ల కంపెనీలకు ప్రచారం చేస్తున్నారు. మరి వీళ్లపై ఉద్యమాలు జరగలేదేం
Please Read Disclaimer