షూటింగుల కోసం గైడ్ లైన్స్ రెడీ చేసిన క్రియేటివ్ డైరెక్టర్…?

0

దేశ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ క్లోజ్ అయిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు ఆగిపోయాయి.. థియేటర్స్ బంద్ అయ్యాయి. దీంతో సినిమాపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులు.. నిర్మాణాంతర పనులు చేసుకోడానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయి. అయితే షూటింగ్ లు ప్రారంభించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు నియమ నిబంధనల విషయంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు తయారు చేస్తోంది. అంతేకాకుండా ఇండస్ట్రీ నుంచి కూడా సలహాలు సూచనలు కోరిందట. దీనికోసం గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసే బాధ్యతను సినీ పెద్దలు క్రియేటివ్ డైరెక్టర్ తేజకు అప్పగించారని సమాచారం. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తేజ పని విషయంలో ఫర్ఫెక్ట్ గా స్ట్రిక్ట్ గా ఉంటాడనే టాక్ ఉంది. ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ విషయంలో కూడా తేజ స్ట్రిక్ట్ గా ఉన్నాడట.

కాగా సినిమా షూటింగ్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని నిర్వహించాలో ఇండస్ట్రీ తరఫున ఇప్పటికే తేజ కొన్ని గైడ్ లైన్స్ రెడీ చేసాడట. షూటింగ్ సమయంలో నటీనటులు తప్ప మిగతా అందరూ పీపీఈ కిట్లు ధరించాలని తేజ సూచించాడట. అంతేకాకుండా షూటింగ్ లొకేషన్స్ లో భోజనం లాంటివి వద్దని ఎవరి భోజనాలు వాళ్లే తెచ్చుకోవాలన్న సూచన కూడా చేశారట. షూటింగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకితే చికిత్స ఖర్చులు నిర్మాతే భరించాలని.. వయసు మీద పడిన నటీనటులు టెక్నీషియన్లు షూటింగ్ లొకేషన్ లో ఉండకూడదని సూచించాడట. అంతేకాకుండా సిబ్బందితో పాటు వైద్య నిపుణులు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసాడట. అయితే కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు తేజ సూచనల పట్ల పెదవి విరుస్తున్నారట. సెఫ్టీ మెజర్స్ తీసుకోవాలని సూచించినప్పటికీ అందరూ పీపీఈ కిట్లు ధరించడం కష్టమే అంటున్నారట. లొకేషన్స్ లో భోజనం పెట్టకపోతే అసిస్టెంట్స్ కి జూనియర్ ఆర్టిస్ట్స్ పొట్ట మీద కొడుతున్నట్లే అని కామెంట్స్ చేస్తున్నారట. డైరెక్టర్ తేజ గైడ్ లైన్స్ విషయంలో కఠినంగా వ్యవహరించాడని.. ప్రభుత్వం ముందు ఇవే షరతులు పెడితే వాటికి అనుగుణంగా షూటింగ్స్ చేయడం కష్టమని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారట. తేజ నియమ నిబంధనలు ఇలా ఉంటే మరి ప్రభుత్వం ఎలాంటి సేఫ్టీ మెజర్స్ మార్గదర్శకాలు తీసుకురాబోతోందో చూడాలి.
Please Read Disclaimer