తెలుగు సినిమాలో ప్రముఖ క్రికెటర్

0

గతంతో పోల్చితే ఇప్పుడు తెలుగు సినిమాకు బాగా క్రేజ్ పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రం తర్వాత తెలుగు సినిమా గురించి ప్రపంచం వ్యాప్తంగా మాట్లాడుకోవడం జరిగింది. ఇక పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ సినిమాలపై మరియు మన దర్శకులపై నమ్మకంగా ఉన్నారు. తాజాగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పడం జరిగింది.

బ్రావో నటించబోతున్నది ఫుల్ లెంగ్త్ మూవీ కాదు. ఒక షార్ట్ ఫిల్మ్ లో బ్రావో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే విషయంపై ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మాణం జరుగుతుంది. సమాజంలో సమస్యలను పాలద్రోలేందుకు కార్పోరేట్ సంస్థల అధినేతలు ముందుకు రావాలనేది ఈ షార్ట్ ఫిల్మ్ ముఖ్య ఉద్దేశ్యం. షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ నచ్చడంతో బ్రావో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ చిత్రం ఇండియాలోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించడంతో పాటు వెస్టిండీస్ లోని టొబాగో మరియు ట్రినిడాడ్ లో చిత్రీకరించబోతున్నారు. ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్మాత చేస్తున్న ఈ ప్రయత్నంను బ్రావో అభినందించి ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఓ బేబీ.. అనుష్క ‘సైలెన్స్’.. వెంకీ మామ ఇంకా రెండు మూడు సినిమాలను కూడా తెలుగులో నిర్మిస్తున్నాడు. ఇదే సమయంలో ఆ షార్ట్ ఫిల్మ్ ను కూడా తీయబోతున్నాడు. ఈ షార్ట్ ఫిల్మ్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెళ్లడిస్తామన్నాడు. తాజాగా బ్రావోను కలిసి షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లుగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధికారికంగా వెళ్లడించింది.

Comments are closed.