వీడియో: ఆ బికినీ ఊప్స్ చూశాక క్రైమ్ గ్యారెంటీ

0

తీరైన దేహశిరుల్ని మెయింటెయిన్ చేసేందుకు గంటల కొద్దీ సమయం వెచ్చిస్తుంటుంది దిశా పటానీ. మోడల్ టర్న్ డ్ నటిగా అందం ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో కమిటెడ్ గా హార్డ్ వర్క్ చేస్తుంది. అయితే ఆ కష్టం ఏనాడూ వృధా పోలేదు. అసలు తాను ఏ సినిమాలో నటించినా నటించకపోయినా కుర్రకారు కళ్లన్నీ తనపై నుంచి దూరం అవ్వడం చాలా కష్టం. అంతగా సోషల్ మీడియాల్లోనూ పాపులారిటీ తెచ్చుకుంది. కోట్లాది మందికి నిరంతర ఫోటోషూట్లతో ట్రీటిస్తూనే ఉంది. ఇక సీకే బ్రాండ్ లోదుస్తులతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోయింది.

అందుకే దిశ నటిస్తున్న మళంగ్ కి ఇది పెద్ద ప్లస్ కానుంది. ఫిబ్రవరి 7న మళంగ్ థియేటర్లలో రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచారం హోరెత్తిస్తోంది. తాజాగా ఈ మూవీన నుంచి అదిరిపోయే పెప్పీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం దిశా బికినీ డ్రెస్ ట్రీట్ అదరహో అనే చెప్పాలి. మెరుపులు మిరుమిట్ల ఛమ్కీల డ్రెస్ లో దిశా ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. దిశా నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ తో .. ఒంపు సొంపుల ట్రీట్ తో కుర్రకారును ఓ రేంజులో కవ్వించింది. పర్ఫెక్ట్ ఫిట్ బాడీ అంటే ఇదే అనేంతగా తన రూపురేఖల్ని తీర్చిదిద్దిన దిశా తనలోని ఏ అందాల శిరిని దాచుకోకుండా ఈ పాటలో ఆరబోసింది. ఈ సాంగ్ రిలీజైన 12గంటల్లోనే 4 లక్షల మందికి యూట్యూబ్ లో చేరువైంది. ఇంకా జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది.

రిలీజ్ కి మరో రెండ్రోజులే సమయం ఉంది కాబట్టి ఇస్పీడ్ లోనే వరుసగా ప్రచార సామాగ్రిని దించేస్తున్నారు. అందులో దిశా పటానీ అందాల ట్రీట్ మత్తెక్కిస్తోంది. ఈ చిత్రానికి ఆషిఖి 2 ఫేం మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఆదిత్య రాయ్ కపూర్ – అనీల్ కపూర్ తదితరులు నటించారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-