ఫస్ట్ లుక్: క్రష్.. మరీ ఘాటైన వ్యవహారమే

0

అల్లరి రవిబాబు అభిరుచి.. ప్రతిభ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ట్యాలెంటెడ్ టెక్నీషియన్. కెరీర్ ఆరంభం అద్భుతమైన సినిమాలు తీసి యువతరాన్ని మెప్పించారు. అవును సినిమా వరకూ అతడి టైమ్ నడిచింది. కానీ ఎందుకనో ఆ తర్వాత మాత్రం అతడి పాచికలు పారలేదు. రకరకాల ప్రయోగాలు చేసి బాగా చేతులు కాల్చుకున్నాడు. అవును 2 -లడ్డు బాబు- అదుగో-ఆవిరి ఇవన్నీ అతడిని తీవ్రంగా నిరాశపరిచాయి. అయినా అతడు తన ప్రయత్నాలు మానలేదు. తనదైన పంథాలోనే వెళుతున్నాడు.

ఈసారి మరో కొత్త కాన్సెప్టుతో వస్తున్నాడు. యూత్ ని హీటెక్కించే మాంచి రొమాంటిక్ కామెడీతో గరమగరమగా బరిలో దిగాడు. ఈ సినిమాకి `క్రష్` అనే టైటిల్ ని ప్రకటించాడు. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ పోస్టర్ అంతే వేడిగా ఉంది. బీచ్ పరిసరాల్లో నడువొంపు నాగరం కనిపిస్తే తనని వెంటాడే ఆ దొంగ కళ్లు బాపతు ఎలా ఉంటారో టుమ్రీ టైపులో మా బాగానే చూపించారు పోస్టర్ లో. ఇలియానా లాంటి నడువొంపు సుందరి టూపీస్ బికినీలో కంటపడితే .. చొంగకార్చే పురుష పుంగవులకు కొదవేం ఉంటుంది! అన్న సెటైర్ కూడా కనిపిస్తోంది పరిశీలిస్తే. పోస్టర్ తోనే హీట్ పెంచాడు. రవిబాబు మార్క్ టుమ్రీ పోస్టర్ ఇది. ఈసారి అతడు పూర్తిగా బికినీ బీచ్ ట్రీట్ వైపు దృష్టి సారించాడని చెప్పకనే చెప్పాడు. ఇక ఇందులో అల్లరి టైపులో కామెడీ ఏదైనా వర్కవుటైతే మళ్లీ కంబ్యాక్ సాధ్యమేనేమో!

ఈ చిత్రానికి సత్యానంద్ లాంటి సీనియర్ రైటర్ పని చేస్తుండడం మరో అస్సెట్. ఎన్ సుధాకర్ రెడ్డి- మార్తాండ్ కె వెంకటేష్- భాస్కరభట్ల- నారాయణరెడ్డి- నివాస్ వంటి టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఏ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. రవిబాబు తనదైన స్కూల్ లో వెళ్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Please Read Disclaimer